కాంగ్రెస్‌లోకి వెళ్లే ఆలోచన లేదు

– కొత్త పార్టీపై నిర్ణయం తీసుకోలేదు
– ఇరిగేషన్‌పై గతంలోనే కెటిఆర్‌ను హెచ్చరించా
– ఆల్మట్టిపై సిఎం పెదవి విప్పాల్సిందే
– మీడియా సమావేశంలో జాగృతి అధ్యక్షురాలు కవిత

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌20: ‌సుప్రీం కోర్టు స్టే ఉన్నప్పటికీ ఆల్మట్టి ఆనకట్ట ఎత్తు పెంచేందుకు కర్ణాటక సిద్ధమైందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తెలిపారు. ఆల్మట్టిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్లాలని అన్నారు. ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం వెళ్లకుంటే జాగృతి తరపున సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని, మహారాష్ట్ర ఇప్పటికే స్పందించి కోర్టును ఆశ్రయిస్తామని ప్రకటించిందని తెలియజేశారు. ఆల్మట్టి ఎత్తు పెంచితే కృష్ణాలో క్రికెట్‌ ఆడుకోవడం తప్ప ఏ ఉండదని రేవంత్‌ ‌ప్రభుత్వానికి చురకలంటించారు. పదేళ్లలో ఆర్డిఎస్‌ ‌తుమ్మిళ్ల, పాలమూరు- రంగారెడ్డి పూర్తి చేసుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. సిఎం రేవంత్‌ ‌రెడ్డి కూడా కృష్ణా ట్రైబ్యునల్‌ ‌విచారణకు వెళ్లాలని సూచించారు. బిఆర్‌ఎస్‌ ‌పార్టీ, మాజీ మంత్రి, ఎమ్మల్యే హరీష్‌ ‌రావు, సంతోష్‌ ‌సోషల్‌ ‌మీడియా తనపైనే దాడి చేస్తున్నాయని, ఇది ప్రజలు గమనిస్తున్నారని కవిత పేర్కొన్నారు. బిసి రిజర్వేషన్లపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే నిరసనలు తెలుపుతామని, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశానని, ఆమోదించాలని ఛైర్మన్‌ ‌ను కోరానని చెప్పారు. ఫోన్‌ ‌ద్వారా కూడా తన రాజీనామాను తెలియచేశానన్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్ని పార్టీలు ఉంటే అంత మంచిదని, ప్రజాస్వామ్యంలో కొత్త పార్టీలు వస్తే స్వాగతిస్తామని చెప్పారు. తన తండ్రి పార్టీ పెట్టేప్పుడు అనేకందిని సంప్రదించారని, తానూ అదే చేస్తున్నానని అన్నారు. తండ్రి పార్టీ నుంచి బహిష్రణకు గురైన కూతురిని తానేనని అన్నారు.  ఆదివారం చింతమడకలో జరిగే బతుకమ్మ వేడుకల్లో పాల్గొంటానని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ ‌లోకి వెళ్లాలన్న ఆలోచన తనకు లేదని, కాంగ్రెస్‌ ‌పెద్దలు ఎవరూ తనను సంప్రదించలేదని అన్నారు. సిఎం రేవంత్‌ ‌రెడ్డి  ఎందుకలా అంటున్నారో తెలియదని.. భయపడుతున్నారేమోనని ఎద్దేవా చేశారు. నిజానికి వెళితేగిలితే రేవంత్‌ ‌బయటకు వెళతారేమోనని అన్నారు. కాళేశ్వరం అంశంలో తప్ప మాజీ మంత్రి హరీష్‌ ‌రావుపై తనకు వేరే కోపం లేదని, ఇరిగేషన్‌ ‌పై 2016 లోనే బిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసింట్‌ ‌కెటిఆర్‌ ‌కు సూచించానని అన్నారు. నేరుగా సిఎంకే ఫైళ్లు వెళ్తున్నాయని బిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసింట్‌ ‌కెటిఆర్‌ ‌కు చెప్పానని తెలిపారు. కిందిస్థాయి కమిటి పరిశీలన, ఆమోదం లేకుండానే సిఎంకు ఫైళ్లు వెళ్లాయని, జస్టిస్‌ ‌పిసి ఘోష్‌ ‌కమిషన్‌ ‌నివేదిక చూస్తే అవన్నీ అర్థమవుతాయని అన్నారు. రాజకీయాల్లోఎవరూ స్పేస్‌ ఇవ్వరు.. తొక్కుకుంటూ వెళ్లాల్సిందేనని కవిత హెచ్చరించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *