– వైస్ ఛాన్స్ లర్ ను తక్షణమే తొలగించాలి
– ఫెయిల్ అయిన విద్యార్థులను పాస్ చేయడమేంటి?
– ఇటువంటి విద్యార్థులు డాక్టర్లయితే పరిస్థితేంటి?
– అమాయక రోగుల ప్రాణాలకు ప్రమాదం వాటిల్లదా?
– గవర్నర్ కు బీఆర్ఎస్ నేత హరీష్ రావు లేఖ
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 27: ప్రతిష్టాత్మకమైన కాళోజీ నారాయణ రావు ఆరోగ్య విశ్వవిద్యాలయం, కాంగ్రెస్ పాలనలో అవినీతి, అక్రమాలు, వివాదాలకు నిలయంగా మారడం అత్యంత శోచనీయమని మాజీ మంత్రి హరీష్ రావు రాష్ట్ర గవర్నర్ కు, ఎన్ఎంసీ చైర్మన్ కు రాసిన లేఖలో ఆరోపించారు. ఇటీవలి కాలంలో ఈ విశ్వవిద్యా లయం కేంద్రంగా జరిగిన పరిణామాలు వైద్య విద్యార్థులు, తల్లిదండ్రులతోపాటు సమా జంలోని అన్ని వర్గాలలో తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వైద్య విద్య మార్కుల రీ-వాల్యుయేషన్ ప్రక్రియపై కొద్ది రోజులుగా వరుసగా తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తుతున్నప్పటికీ ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉన్నట్లు? పీజీ వైద్య పరీక్షల్లో ఫెయిల్ అయిన ఐదుగురు విద్యార్థులు, కొద్ది రోజులకే ఎలా పాస్ అవుతారు? ఈ అక్రమాల వెనుక విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ డా. నంద కుమార్ రెడ్డి సూత్రధారి అని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నప్పటికీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఫెయిల్ అయిన విద్యార్థులంతా ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు చెందినవారే కావడం, వైస్ ఛాన్స లర్ ఆ కాలేజీలతో ఎన్ని కోట్ల రూపాయల డీల్ కుదుర్చకున్నారన్న ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని పేర్కొన్నారు. స్కాం విషయంలో వీసీ వెనుక ఉన్న ప్రభుత్వ పెద్దలెవరో తేల్చాలన్నారు. రీ-కౌంటింగ్ తర్వాత ఓ విద్యార్థి పాస్ కావడం కాళోజీ విశ్వ విద్యాలయ చరిత్రలోనే మొదటిసారి కావడం, ఇది నిబంధనల ఉల్లంఘనకు స్పష్టమైన ఉదాహరణ అన్నారు. విశ్వవిద్యాలయ నిబంధనలు, నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎమ్ఎసీ) మార్గదర్శకాలు, హైకోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ ఈ అక్రమాలు జరగడం వైద్య విద్యా వ్యవస్థకు మాయని మచ్చ అన్నారు. విశ్వవి ద్యాలయం, ఎన్ఎమ్స నిబంధనల ప్రకారం రీ-కౌంటింగ్ కు మాత్రమే అవకాశం ఉంటుంది, కానీ రీ-వాల్యుయేషన్ చేయడం అనే ది అక్రమమన్నారు. పరీక్షలు ముగిసిన తర్వాత వీసీ స్వయంగా సమాధాన పత్రాల్లోని క్రాస్ మార్క్ ఉన్న పేజీల్లో విద్యార్థులతో సమాధానాలు రాయించి, తిరిగి మూల్యాంకనం చేయించి, ఎక్కువ మార్కులు వేయించి ఐదుగురిని పాస్ చేయించారని అందులో ఒక విద్యార్థి విజిలెన్స్ విచారణలో స్పష్టంగా వెల్లడించాడని గుర్తుచేశారు. పీజీ వైద్య పరీక్లను సజావుగా నిర్వహించడంలో పూర్తిగా విఫలమయ్యారు. సమ ర్థవంతమైన అధికారులకు అవకాశం కల్పించకుండా రాజకీయ అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల యూనివర్సిటీ ఖ్యాతి రోడ్డున పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు రీ-వాల్యుయేషన్ చేసే అధికారం వీసీకు ఎవరు ఇచ్చారు? సమాధాన పత్రాలను తిరిగి విద్యార్థులకు ఇచ్చి సమాధా నాలు రాయించమని వీసీకి చెప్పినవారు ఎవరు? ఫెయిల్ అయిన వారిని పాస్ చేయాలని ఆదేశించినవారు ఎవరు? ఆరోగ్య శాఖ నియమించిన కమిటీ అవకతవకలను గుర్తించినప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఈ స్కాంలో ప్రభుత్వం కాపాడుతున్న ఆ పెద్ద మనిషి ఎవరు? ఇది మాత్రమే కాదు ఎంబీబీఎస్ పరీక్షలలో కూడా కొందరు అక్రమంగా పాస్ అవడం, మాన్యు వల్ మార్కుల సవరణలు, సర్వర్ మార్పులు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయని పేర్కొ న్నారు. ఈ విషయంపై విద్యార్థులు ఫోరెన్సిక్ ఆడిట్ డిమాండ్ చేస్తున్నప్పటికీ ప్రభుత్వం ఎందుకు నిరాకరిస్తున్నదని ప్రశ్నించారు. కాళోజీ విశ్వవిద్యాలయ పరీక్షా వ్యవస్థ పూర్తిగా అక్రమాలకు నిలయంగా మారడం దురదృష్టకరం, ఇది విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అర్హత లేని విద్యార్థులను వై ద్య విద్యలో అడ్డదారిలో పాస్ చేస్తే ప్రజల ప్రా ణాలు తీస్తారని హెచ్చరించారు. కమీషన్ల కోసం కక్కుర్తి పడి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటం దుర్మార్గమ న్నారు. వైస్ ఛాన్సలర్ పై అవినీతి ఆరోపణలు వస్తున్నప్పటికీ, ఫేక్ ఇన్స్పెక్షన్లు, వైద్య, నర్సిం గ్ కాలేజీల నుండి భారీ మొత్తాలు వసూలు చేయడం వంటివి ప్రతికల ద్వారా వెలుగు చూస్తున్నప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోవ డం లేదని ప్రశ్నిం చారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వైస్ ఛాన్సలర్ నందకుమార్ రెడ్డిని వెంటనే విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీ కేంద్రంగా జరిగిన అవినీతి, అక్రమాలపై పూర్తి విచారణ జరపాలి. వీసీకి అండగా ఉన్న రాజకీయ పెద్దలెవరో బహిర్గతం చేయాలని కోరారు. ఆరోగ్య శాఖ, విజిలెన్స్ శాఖ దర్యాప్తు నివేది కలను బయట పెట్టాలి. ఎంబీబీఎస్, పీజీ పరీక్షల మోసాలు, మార్కుల రీ-వాల్యు యేషన్, సర్వర్ మార్పులు మొదలైనవాటిపై పూర్తి ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహిం చాలని ఆయన తన లేఖలో డిమాండ్ చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




