– సీఎస్‌ను కోరిన హరీష్ రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 8: కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన పూర్తి నివేదికను ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు కోరారు. సచివాలయానికి వెళ్లి సీఎస్ రామకృష్ణరావును ఆయన శుక్రవారం కలిశారు. జస్టిస్ ఘోష్ ఇచ్చిన 665 పేజీల నివేదిక ప్రతులను ఇవ్వాలని కోరుతూ కేసీఆర్, హరీష్ రావు పేరుతో వేర్వేరు వినతి పత్రాలను అందజేశారు. అనంతరం వినతిపత్రాలు ఇచ్చినట్లు రశీదులు తీసుకున్నారు. హరీశ్‌రావు విజ్ఞప్తిని పరిశీలించి చెబుతామని సీఎస్ చెప్పినట్లు సమాచారం. బీఆర్‌ఎస్ మ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, బండారు లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ తదితరులు హరీష్ రావు వెంట ఉన్నారు.



