హైదరాబాద్,ప్రజాతంత్ర,నవంబర్12: కాళేశ్వరం కమిషన్‌పై విచారణను హైకోర్టు జనవరి రెండో వారానికి వాయిదా వేసింది. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయడానికి 4 వారాల గడువు ఇచ్చింది. ప్రభుత్వ కౌంటర్‌కు సమాధానం ఇచ్చేందుకు పిటిషనర్లకు మరో 3 వారాలు గడువు ఇచ్చింది. కేసీఆర్‌తోపాటు హరీష్ రావు, స్మితా సబర్వాల్, ఎస్‌కే జోషికి 3 వారాల గడువు ఇచ్చిన ఉన్నత న్యాయస్థానం.. అప్పటివరకు మధ్యంతర ఉత్తర్వులు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కాళేశ్వరం కమిషన్ ఆధారంగా చర్యలు తీసుకోవద్దని గతంలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇకపోతే ఈ వ్యవహారంలో ప్రభుత్వం సిబిఐ విచారణకు ఆదేశించింది. అయితే ఇంతవరకు సిబిఐ రంగంలోకి దిగలేదు. దీనిపై ఇటీవలే సిఎం రేవంత్ రెడ్డి కూడా విమర్శలు సంధించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





