కాళేశ్వరంపై అసెంబ్లీలో చర్చ షురూ

– పెన్‌డ్రైవ్‌లలో సభ్యులకు నివేదిక అందజేత
– లక్ష కోట్లు ఖర్చు చేసి లక్ష ఎకరాలకు కూడా నీళ్లివ్వలేదు
– డిజైన్లను మార్చేసిన కేసీఆర్‌
– మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 31: కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో అవకతవకలు, ప్రాజెక్టులో భాగమైన మేడగడ్డ, అన్నారం బ్యారేజీల కుంగుబాటుపై విచారణ జరిపిన జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ ప్రభుత్వానికి అందజేసిన నివేదికపై అసెంబ్లీలో చర్చ ప్రారంభమైంది. ఈ నివేదికను ప్రభుత్వం ఎమ్మెల్యేలందరికీ పెన్‌డ్రైవ్‌లలో అందజేసింది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి దీనిపై పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చి చర్చను ప్రారంభించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి బీఆర్‌ఎస్‌ పాలకులు రూ.87,449 కోట్లు ఖర్చు చేశారని అసెంబీవేదికగా తెలిపారు. అయినా మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం ప్రాజెక్టులు నియోపయోగంగా మారాయని చెప్పారు. ప్రాజెక్టుకు గుండెకాయలాంటి మేడిగడ్డ కూలిందని వెల్లడిరచారు. 20 నెలలుగా కాళేశ్వరం ప్రాజెక్టు నిరుపయోగంగా ఉండటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణహిత-చేవెళ్లకు జాతీయ హోదా ఇవ్వాలని గతంలో మూడు లేఖలు రాశారు. అయితే ఆ డిజైన్లను అప్పటి సీిఎం కేసీఆర్‌ మార్చారని కమిటీ చెప్పిందని ఉత్తమ్‌ పేర్కొన్నారు. మేడిగడ్డలో బ్యారేజ్‌ నిర్మించవద్దని నిపుణుల కమిటీ స్పష్టంగా చెప్పిందని, అక్కడ బ్యారేజ్‌ వద్దని వ్యాప్కోస్‌ నిపుణులు కూడా చెప్పారని, ఆ నిపుణులు డీపీఆర్‌ ఇవ్వకముందే మేడిగడ్డ వద్ద బ్యారేజ్‌ కట్టాలని నిర్ణయించారని కమిషన్‌ తన నివేదికలో పేర్కొందని మంత్రి ఉత్తవమ్‌ తెలిపారు. కేబినెట్‌ అనుమతి లేకుండానే జీవో ఇచ్చారని, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల నిర్మాణ ఖర్చులను భారీగా పెంచేశారన్నారు. బ్యారేజ్‌లకు జరిగిన నష్టం రాష్ట్రానికి పెనుభారంగా మారిందన్నారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు రూ.38 వేల కోట్లతో పూర్తవ్వాల్సి ఉండగా దాన్ని రూ.లక్షా 47 వేల కోట్లకు పెంచారు అని వివరించారు. 2019 నుంచి 2023 వరకు లిఫ్ట్‌ చేసింది 162 టీఎంసీిలు మాత్రమేనన్నారు. కాళేశ్వరం నుంచి ఏడాదికి 20.2 టీఎంసీలు మాత్రమే లిఫ్ట్‌ చేశారని, 34 లక్షల ఎకరాలకు ఆయకట్టుకు నీరు ఇస్తామని చెప్పారు… రూ.లక్ష కోట్లు ఖర్చు చేసినా లక్ష ఎకరాలకు కూడా నీరు ఇవ్వలేదన్నారు. మేడిగడ్డ బ్యారేజ్‌ కుంగినప్పుడు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే ఉందన్నారు. ఎన్‌డీఎస్‌ఎఫ్‌పై బీఆర్‌ఎస్‌ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఆ అథారిటీ బిల్లు తెచ్చినప్పుడు బీఆర్‌ఎస్‌ మద్దతిచ్చిందని ఉత్తమ్‌ చెప్పారు. డ్యామ్‌కు, బ్యారేజ్‌కు తేడా లేకుండా పనులు చేశారని ఎన్‌డీఎస్‌ఎ నివేదికలో ఉందన్నారు. మేడిగడ్డలో పూర్తి నీరు నిల్వ చేసి కూలిపోయేందుకు కారణమయ్యారని ఉత్తమ్‌ ఆరోపించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *