– ప్రభుత్వాలు వస్తాయి పోతాయి
– కాంగ్రెస్ పార్టీ శాశ్వతం
– కార్యకర్తలే పార్టీ బలం
– ప్రజలే అధికారానికి కారణం
– టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్
ములుగు, ప్రజాతంత్ర, ఏప్రిల్ 11: ఎనిమిది లక్షల కోట్ల అప్పుతో రాష్ట్రం దెబ్బతిన్నది టిపి సిసి మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. శనివా రం ములుగు జిల్లా కేంద్రంలో డీసీసీ అధ్యక్షు కాంగ్రెస్ కమిటీ కార్యవర్గ సమావేశానికి టీ డు అశోక్ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్య క్రమానికి ముందుగా స్థానిక ఘట్టమ్మ దేవా లయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఘట్టమ్మ దేవాల యం నుండి భారీ ర్యాలీగా బయలుదేరిన కాంగ్రెస్ శ్రేణులు ములుగు జిల్లా కేంద్రానికి చేరుకోగా అక్కడ నాయకులు మహేష్ కు మార్ గౌడ్ కు గజమాలతో ఘన సన్మానం చేశారు. అదే ఉత్సాహంతో ర్యాలీ కొనసాగు తూ లీలా గార్డెన్ వరకు చేరుకుని సమావేశ ప్రాంగణానికి చేరుకుంది. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి సమావేశాన్ని ప్రారంభించిన ఆయన రాష్ట్ర మంత్రి సీతక్క, ఎంపీ బలరాం నాయక్తో కలిసి పాల్గొని డీసీసీ కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించి పార్టీ బలోపేతానికి కట్టుబడి పనిచేయాలని పిలు పునిచ్చారు. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున కార్యక ర్తలు పాల్గొని కాంగ్రెస్ శక్తిని చాటిచెప్పారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ ప్రభుత్వాలు వస్తాయి పోతాయ్ కానీ కాంగ్రెస్ పార్టీ శాశ్వతమని, కార్యకర్తలే పార్టీకి అసలైన బలం అని స్పష్టం చేశారు. సమ్మక్క సారక్క జాతర అభివృద్ధికి రూ.200 కోట్లకు పైగా నిధులు కేటాయించి పనులు కొనసాగుతున్నాయని, గ్లోబల్ సమ్మిట్ ద్వారా రూ.5 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చినట్లు వివ రించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ కేసీఆర్ ఎనిమిది లక్షల కోట్ల అప్పులు చేసి ఫామ్ హౌస్ కు పరిమిత మయ్యారని, కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోవ డం అవినీతి పాలనకు నిదర్శనమని ఆరోపించారు. మామ అల్లుడు అవినీతి వల్లే ఆ ప్రాజెక్టుకు ఈ గతి వచ్చిందని, కుటుంబ పా లనతో రాష్ట్రాన్ని దోచుకున్నారని విమర్శిం చారు. దొడ్డు బియ్యం పేరుతో ప్రజల డబ్బు లు దుర్వినియోగం చేశారని ఆరోపించారు. బీజేపీపై కూడా విమర్శలు చేస్తూ 12 ఏళ్ల పాలనలో తెలంగాణకు ఎలాంటి లాభం చే కూరలేదని, లాభాల్లో ఉన్న ప్రభుత్వ సంస్థ లను అంబానీ, అదానీలకు కట్టబెట్టారని అన్నారు. దేవుడి పేరుతో రాజకీయాలు చేసే పార్టీగా బీజేపీ ఉందని, రాష్ట్రంలో ఆ పార్టీకి స్థానం లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ కుల సర్వే నిర్వహించి దేశానికి ఆదర్శంగా నిలిచిందని, మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు పెద్దఎత్తున అవకాశాలు కల్పించినట్లు తెలి పారు. మంత్రి సీతక్కపై ప్రస్తావిస్తూ ఒక ప్పుడు తుపాకీతో పోరాడిన ఆమె ఇప్పుడు మంత్రిగా ప్రజలకు సేవ చేస్తోందని అన్నా రు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లతో ప్రభు త్వం ముందుకు సాగుతుందని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ 100కు పైగా సీట్లు గెలవ డం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కష్టప డి పనిచేసే ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉం టుందని, పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుం దని పేర్కొంటూ నూతన బాధ్యతలు స్వీక రించిన నాయకులకు అభినందనలు తెలిపా రు. జై హింద్, జై కాంగ్రెస్ అంటూ ప్రసం గాన్ని ముగించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





