కాళేశ్వరం కేసును సీబీఐ కి అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆదివారం రాష్ట్ర అసెంబ్లీ లో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులు..జరిగిన అవకతవకల పై జస్టిస్ పి సి గోష్ నివేదిక పై సుదీర్ఘ చర్చ అనంతరం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆఖరున సభా నాయకుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ “మేడిగడ్డ నిర్వహణ..నిర్మాణం లోపభూయిష్టం అని NDSA నివేదిక చెప్పింది ఇది కాంగ్రెస్ చెప్పలేదు.. NDSA చెప్పింది డిజైన్.. నిర్మాణం.. మెయింటైన్ చేయడంలో కూడా లోపం ఉంది NDSA రిపోర్ట్ ను ..NDA రిపోర్ట్ అంటారు అని…అది ఆయన తెలివి తేటలు అవి నిజాం కంటే శ్రీమంతుడు కావాలని కోరికతో దోపిడీకి పాల్పడ్డారు కేసీఆర్…ఆయన మనువడు వరకు పరిపాలన చేయాలని ఆశ పడ్డారు ప్రపంచంలో ఆగర్భ శ్రీమంతుడు కావాలని, 200 సంవత్సరాలు పరిపాలించాలనే దురాశతో కాళేశ్వరం రీడిజైనింగ్ పేరుతో దోచుకున్నారు మేడిగడ్డ లోపాలు 18.5.2020 రోజున ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బీవీ రమణారెడ్డి లేఖ రాశారు ప్రాజెక్టులో లోపాలు ఉన్నాయని చెప్పారు 2020 లో మేము అధికారంలో లేము. మీరు అధికారంలో ఉండి.. లోపాల పై ఎందుకు చర్యలు తీసుకోలేదు.. కేసీఆర్..హరీష్ సమాధానం చెప్పాలి ఇప్పుడు మేమేదో కక్ష కట్టినట్టు.. మేమేదో కక్ష సాదింపు చర్యలకు పాల్పడుతున్నట్టు మాట్లాడుతున్నారు ..అందుకే కేంద్ర ప్రభుత్వం విచారణ సంస్థ సీ బీ ఐ కి కాళేశ్వరం కేసును అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది అని పేర్కొన్నారు.





