కెయు సమగ్రాభివృద్ధికి సమష్టి కృషి

 కేయూ ఉపకులపతి ప్రొఫెసర్ ప్రతాపరెడ్డి

 కాళోజీ జంక్షన్/హన్మకొండ ప్రజాతంత్ర మే 27 : అన్ని రంగాల్లో  కాకతీయ విశ్వవిద్యాలయ (kakatiya university) సమగ్రాభివృద్ధికి సమష్ఠిగా కృషి చేస్తున్నామని  కేయూ ఉపకులపతి ప్రొఫెసర్ కె.ప్రతాపరెడ్డి అన్నారు. మంగళవారం  కెయు సెనెట్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచంద్రంతో కలిసి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. విశ్వవిద్యాలయంలో  సెమినార్లు, వర్క్ షాప్ లు, ఫాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాంలు, పూర్వ విద్యార్థులు సమ్మేళనాలు, విద్యార్థులకు అవగాహన సదస్సులు, వ్యక్తిత్వ వికాస కార్యక్రమాల ద్వారా అకాడమిక్ పరంగా విద్యార్థులు, అధ్యాపకులు సహకారంతో బలోపేతం చేస్తామన్నారు. కొద్ది మార్పులతో తెలంగాణలో అన్ని యూనివర్సిటీల కంటే ముందుగా డిగ్రీ, పి.జి. పరీక్షల నిర్వహించామన్నారు. ప్రాంగణ నియామకాలు చేపట్టామన్నారు. యూనివర్సిటీ బడ్జెట్ ను  ముఖ్యమంత్రి సహకారంతో రూ. 98 కోట్ల నుంచి 144 కోట్లకు పెంచారని చెప్పారు. రూ. 50 కోట్లు అభివృద్ధి గ్రాంట్స్ ను బడ్జెట్ లో పొందామన్నారు. ఈ నిధులు పూర్తిగా మౌలిక వసతులకు, అకాడమిక్ నిర్వహణకు ఖర్చు చేస్తామన్నారు. కేయూ రుసా రూ.2 కోట్ల నిధులు ఎంపికైందని, దీంతో విశ్వవిద్యాలయంలో కే హబ్ ను నిర్వహణలోనికి తీసుకొస్తామన్నారు. సెంటర్ ఫర్ ఎంటర్ ప్రేన్యుర్షిప్, ఇన్నోవేషన్ సెల్ గా చేస్తామన్నారు. 5 ఐదు రీసెర్చ్ సెంటర్లను, వ్యక్తిగత ప్రాజెక్ట్ లను, 65 మంది ప్రాజెక్ట్ ఫెల్లోషిప్ లకు అవకాశం వచ్చిందన్నారు. ఇంజనీరింగ్, ఫార్మసీలో  స్కిల్ల్స్ ఆధారిత కోర్స్ లను ఎఐసిటిఇ నిబంధనల మేరకు ప్రారంభిస్తామన్నారు. జీవ నైపుణ్యాలు, భాషా నైపుణ్యాలు పెంచే దిశగా సెల్ లను ఏర్పాటు చేస్తామన్నారు. ఆగష్టు 19 నుంచి విశ్వవిద్యాలయం గోల్డెన్ జూబ్లీ సంవత్సరంలోనికి అడుగిడుతున్న సందర్భంగా మూడు రోజుల తెలంగాణ సైన్స్ కాంగ్రెస్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.  దీనికి గుర్తుగా స్వర్ణోత్సవాల అకడమిక్ బిల్డింగ్ ను, యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్సు కాలేజీ శతాబ్ది లోనికి అడిగిడుతున్న సందర్భంగా సెంటినరీ బిల్డింగ్, అకడమిక్ బ్లాక్ ల స్థాపనకు ముఖ్యమంత్రికి ప్రతిపాదనలు అందించినట్టు చెప్పారు.  మహిళా ఇంజనీరింగ్ కాలేజీ అకడమిక్ బ్లాక్, హాస్టల్, కామన్ మెస్, ట్రైబల్ విద్యార్థులు కొరకు ఒకటి బాలుర, ఒకటి బాలికల వసతి గృహల కోసం ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
సంబంధిత అధికారుల నుంచి వచ్చిన నివేదికల అనంతరం, పాలక మండలి నిర్ణయం మేరకు  ప్రహరీ నిర్మాణం చేపడుతామన్నారు. యూనివర్సిటీ భూముల్లో  అక్రమాలకు పాల్పడిన అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.  విద్యార్థుల్లో నైపుణ్యాల అబివృద్ధి కోసం  నాస్కం, ఐటిఇఎస్ తో అవగహన ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. పివి విజ్ఞాన పీఠంను ప్రారంభించి సామాజక, ఆర్థిక పురోగతి పరిశోధనల కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్నారు. విద్యార్థుల కోసం ఇద్దరు మెడికల్ ఆఫీసర్లను ఆరోగ్య కేంద్రం లో నియామకం చేసినట్టు తెలిపారు. జూలై 7, కెయు 23వ స్నాతకోత్సవ నిర్వహణకు రాష్ట్ర గవర్నర్, విశ్వవిద్యాలయ ఛాన్సలర్ జిష్ణు దేవ్ వర్మ అనుమతి ఇచ్చినట్లు పేర్కొన్నారు. 573 మందికి గోల్డ్ మెడల్ లు, 546 మందికి డాక్టరేట్ పట్టాలు ప్రధానం చేయనున్నట్లు వెల్లడించారు.  ఐఐసీటీ డైరెక్టర్   ముఖ్యఅతిదిగా విచేస్తారని తెలిపారు. విలేఖరులు అడిగిన పలు ప్రశ్న లకు సమాధానాలు ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *