అమెరికా కార్పొరేట్ల కనుసన్నల్లో కగార్‌-2..!

ఆపరేషన్‌ కగార్‌తో కేంద్రం తన లక్ష్యాన్ని రీచ్ అయ్కే పరిస్థితులు కనుచూపు మేరలో కనపించడం లేదు.ఒక్కరి చంపితే వందల మంది ఉద్యమకారులను పుడుతున్నారు.దీంతో దండకారణ్యం పై భారత ప్రభుత్వం పూర్తి స్థాయికి యుద్దానికి దిగినట్లు తెలుస్తుంది..అయితే ఈ యద్దాన్ని అమెరికా, భారత్‌ సంయుక్తంగా నిర్వహిస్తుంది.భారత పాలకులను  ముందు పెట్టి అమెరికా ద్రవ్య సంస్థలు పరోక్షంగా భారత సైన్యంతో మధ్య భారత్‌లో నరమేధం సృష్టిస్తుంది.
భారత్‌లో అమెరిక పౌరులకు ఇచ్చిన ట్రావెల్‌ అడ్వయిజరీని ఈ కోణంలోనే చూడాల్సి ఉంది.అంతేకాదు ఆపరేషన్‌ కగార్‌ మొదటి దశ ముగిసింది.ఇప్పుడు కగార్‌-2ను ప్రారంభించి మరింత ఉధృతం  చేసేందుకు భారత ప్రభుత్వం ప్లాన్‌ చేస్తుంది.ఈ నేపథ్యంలోనే భారత్‌లోని తమ పౌరులకు అమెరికా ప్రభుత్వం కీలక సూచనలు చేసింది.చరిత్రలో తొలిసారి అమెరిక పౌరులు, ఉద్యోగులు మధ్య భారత్‌లో పర్యటించవద్దని ఆదేశాలు జారీ చేసింది.క్రైమ్‌ రేట్‌ పెరిగిందని, ఉగ్రవాదం పేరుతో యూఎస్‌ తన  అడ్వయిజరీలో ప్రస్తావించింది.
అయితే ఆపరేషన్‌ కగార్‌ను రాజ్యం మరింత విస్తృతం చేసిందని, మధ్య భారత దేశంలో ప్రజలపై సైన్యం దాడులు మరింత పెంచుతుందని అమెరికా ప్రభుత్వం తమ పౌరులకు ఇచ్చిన అడ్వయిజరీని గమనిస్తే క్లీయర్‌గా అర్థం అవుతుంది..యూఎస్‌ తమ పౌరులు ఏ ప్రాంతాలకు ఏఏ జిల్లాలు, ఏఏ రాష్ట్రాలకు వెళ్లవద్దో చెప్పిందో చూస్తే..మావోయిస్ట్‌ల ఏరివేతను, ఆదివాసుల హత్యలకు కేంద్రం దాడులు చేసేందుకు మరింత ప్రయత్నాలు చేస్తుందని తెలుస్తుంది.
అయితే యూఎస్ తన పౌరులకు ఇచ్చిన సలహా వెనుక కీలక కుట్రలు ఉన్నాయి.ట్రావెల్‌ అడ్వైజరీ వెనుక  కేంద్ర, కార్పొరేట్ కంపెనీల కుట్రలు కనిపిస్తున్నాయి.మధ్య భారత్ లో ఖనిజ సంపదను దోచుకునే కుట్రలు స్పష్టంగా కనిపిస్తుంది.ఆపరేషన్ కగార్ లో భాగంగానే అడ్వైజరీ చేసినట్లు అర్థం అవుతుంది.కగార్‌ పేరుతో మధ్య భారత్‌తో మరింత దాడులు చేసేందుకు కేంద్రం సమాయత్తం అవుతుందని స్పష్టం అవుతుంది.అందుకే మధ్య భారత్‌లో తమ పౌరులు పర్యటించవద్దని అమెరికా హెచ్చిరించింది.
నిజానికి అగ్రరాజ్యానికి బలమైన ఇంటలిజెన్స్‌ ఉంది..ప్రపంచ పోలీస్‌గా వ్యవహరిస్తుంది..ఏ దేశంలో ఏ మూలన ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుందే ముందు యూఎస్‌కు సమాచారం ఉంటుంది..అవసరమైన ఆయా ప్రభుత్వాలకు పరోక్షంగా సహకారం అందిస్తుంది..ఇప్పుడు మధ్య భారత్‌లో కూడా కేంద్రం మారణ హోమాన్ని మరింత పెంచుతుంది అమెరికా పౌరులకు ట్రావెల్ అడ్వయిజరీ ఇచ్చింది.
.అమెరికా ట్రావెల్‌ అడ్వయిజరీలో కీలక విషయాలు ఉన్నాయి..మరీ ముఖ్యంగా మావోయిస్ట్‌ ప్రాభాల్యం ఉన్న రాష్ట్రాల్లో అందులోకూ నక్సల్స్‌ ఉనికి బలంగా ఉన్న కారిడార్స్‌ను టార్గెట్ చేస్తూ తమ పౌరులకు సూచనలు చేసింది..మధ్య భారత్ లో మావోయిస్టు పార్టీ రెడ్ కారిడార్ గా చెప్పబడుతున్న మహారాష్ట్ర నుంచి బెంగాల్ వరకు పర్యటించవద్దని ఆదేశాలు జారీ చేసింది.
తూర్పు మహారాష్ట్ర, తెలంగాణలోని ఉత్తర తెలంగాణ, చత్తీస్‌ గడ్‌, ఒడిస్సా, బెంగాల్‌, బీహార్‌, మేఘాలయ రాష్ట్రాల్లో, సరిహద్దు ప్రాంతాల్లో పర్యటించవద్దని అమెరికా తమ దేశీయులకు సలహాలు ఇచ్చింది..నిజానికి మహారాష్ట్రలో తూర్పులో గచ్చిరోలిలో మావోయిస్ట్‌ పార్టీ బలంగా ఉంది..ఉత్తర తెలంగాణతో పాటు చత్తీస్‌గడ్‌లో నక్సల్స్ ఉద్యమం స్ట్రాంగ్ ఉంది..ఒడిస్సా, బెంగాల్‌, బీహార్‌లో కూడా అన్నల పోరాటాలు ఉన్నాయి.
.ఇలా మధ్య భారత్‌ గుండా మావోయిస్ట్‌లు రెడ్ కారిడార్‌ ఏర్పాటు చేశారు..ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలు పెట్టిన, ఎన్ని ఎన్‌కౌంటర్లు చేసిన, బూటకపు ఎన్‌కౌంటర్‌లతో అమాయకు ఆదివాసులను చంపిన ప్రజల మద్దతుతో పాలకుల బాధితులతో మావోయిస్ట్‌ పార్టీ పట్టు కోల్పోవడం లేదు..ఎన్‌కౌంటర్లతో కాస్త సెట్‌ బ్యాక్‌ అయిన రెట్టించిన వేగంతో పుంజుకుంటుంది.
లక్షల కోట్ల విలువైన సంపదను దోచుకునేందుకు,ఆ సంపద దోచుకోవడానికి కార్పొరేట్లకు కేంద్రం సహయం చేస్తుంది.కార్పొరేట్‌ సంస్థలు ఇచ్చే ఫండ్స్‌తోనే నడిచే ఆర్థిక వ్యవస్థ భారత్‌ది.అందుకే దేశ సంపదను వారికి కట్టబెట్టేందుకు పాలకులు వెనుకాడటం లేదు..ఈ నేపథ్యంలో ఆ దోపిడిని అడ్డుకుంటున్న మావోయిస్టు పార్టీ పై, ఆదివాసులపై సైనిక చర్యకు ప్రభుత్వం దిగుతుంది..మావోయిస్ట్‌లను చంపేందుకు ఆపరేషన్‌ కగార్‌ కోసం ఆత్యాధునిక ఆయుధ టెక్నాలజి, డ్రోన్లతో పాటు అత్యాధునికి ఆయుధాలు ప్రత్యేక్షంగా ప్రభుత్వం, పరోక్షంగా కార్పొరేట్‌ కంపెనీలు సమకూర్చుతున్నాయి.
అయితే ఆపరేషన్‌ కగార్‌ను రాజ్యం మరింత విస్తృతం చేసిందని, మధ్య భారత దేశంలో ప్రజలపై సైన్యం దాడులు మరింత పెంచుతుందని అమెరికా ప్రభుత్వం తమ పౌరులకు ఇచ్చిన అడ్వయిజరీని గమనిస్తే క్లీయర్‌గా అర్థం అవుతుంది..యూఎస్‌ తమ పౌరులు ఏ ప్రాంతాలకు ఏఏ జిల్లాలు, ఏఏ రాష్ట్రాలకు వెళ్లవద్దో చెప్పిందో చూస్తే..మావోయిస్ట్‌ల ఏరివేతను, ఆదివాసుల హత్యలకు కేంద్రం దాడులు చేసేందుకు మరింత ప్రయత్నాలు చేస్తుందని తెలుస్తుంది.
అమెరిక కూడా ఈ మారణహోమంలో కగార్‌-2లో భాగస్వామ్యం అవుతుందని అర్థం అవుతుంది..ప్రపంచ పెద్దన్న, విశ్వగురు కలిసే మహారాష్ట్ర నుంచి బెంగాల్‌ వరకూ మావోయస్ట్‌ల ఏరివేతతో రెడ్‌ కారిడార్‌ వెంట యుద్ధానికి సిద్దం అయినట్లు యూఎస్ అడ్వయిజరీని గమినిస్తే స్పష్టం అవుతుంది.ఈ నేపథ్యంలోనే అందుకే అమిత్ షా, మోదీ డెడ్ లైన్ పెట్టుతూ వర్షాకాలంలో కూడా ఆపరేషన్ కగార్ కొనసాగుతోందని ప్రకటిస్తున్నారు.మార్చి 2026 నాటికి దేశ సంపదను అమెరికా దొచిపెట్టేందుకు.అమెరికా ద్రవ్య సంస్థల ఒత్తిడితోనే కగార్ వేగవంతం చేస్తుంది..ఆదివాసులను, అన్నలను కాపాడునేందుకు, ఉద్యమాన్ని రక్షించుకునేందుకు విశాల ప్రజల ఐక్యపోరాటాలు తప్ప  కగార్‌-2ను మరే శక్తి ఆపలేదు.
-తోటకూర రమేష్ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *