‌క‌ల్వ‌కుంట్ల‌ కుటుంబానిది ఆస్తుల గొడ‌వ‌

– తెలంగాణ వనరులను దోచుకున్నారు
– పంపకాల త‌గాదాతోనే తాజా పరిస్థితులు
– మాజీ మంత్రి కడియం శ్రీహరి ఆరోపణ

జనగామ, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 5: ‌కల్వకుంట్ల కుటుంబంలో జరుగుతున్న గొడవలు ఆస్తికి సంబంధించినవే నని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌పై స్టేషన్‌ ‌ఘనపూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి హాట్‌ ‌కామెంట్స్ ‌చేశారు. జనగామ జిల్లాలోని లింగాల గణపురం మండలం నవాబుపేట రిజర్వాయర్‌ ‌నుంచి సాగునీటిని శుక్రవారం విడుదల చేశారు. అనంతరం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. పదేళ్ల అధికారంలో కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ వనరులను దోచుకుందని విమర్శించారు. ధరణిని అడ్డుపెట్టుకొని వేల ఎకరాల భూములు కబ్జా చేశారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుపెట్టుకొని కేసీఆర్‌ ‌కుటుంబం వేల కోట్ల రూపాయలు సంపాదించిందని ఆక్షేపించారు. వేల ఎకరాల భూములు, ఈ అక్ర‌మ సంపాద‌న‌ను పంచుకునే క్రమంలో కేసీఆర్‌ ‌కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయని కడియం చెప్పుకొచ్చారు. కేసీఆర్‌ ‌కుటుంబ గొడవలతో ప్రజలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ ‌పార్టీకి, కాంగ్రెస్‌ ‌ప్రభుత్వానికి కూడా సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. తాను బీఆర్‌ఎస్‌ ‌పార్టీకి రాజీనామా చేయడానికి ప్రధాన కారణం కేసీఆర్‌ ‌బిడ్డ లిక్కర్‌ ‌కేసులో ఇన్వాల్వ్ అయినందుకేనని షాకింగ్‌ ‌కామెంట్స్ ‌చేశారు. కవిత లిక్కర్‌ ‌కేసులో విచారణను ఎదుర్కోవడం అనేక రోజులు జైల్లో ఉండటం సరైన పద్ధతి కాదని తాను బయటకు వచ్చానని చెప్పుకొచ్చారు. అవినీతి డబ్బులను పంచుకోవడంలో వారి మధ్య జరిగిన గొడవే తప్పా.. మరి ఇంకా ఏం లేదని ఎమ్మెల్యే కడియం శ్రీహరి విమర్శించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *