కాలమెప్పుడూ పాతబడిపోదూ!
అదెప్పుడు నిత్య నూతనమే
మంచికాలం, చెడ్డకాలమంటూ మనిషే
దాన్ని ముక్కలు చేస్తాడు గానీ కాలానికి గాలం వేయగలదా?!
కాలమెప్పుడూ పాతబడిపోదూ!
ఎండ, వాన, చలికాలమంటూ
మనిషే దాన్ని లెక్కలు వేస్తాడు గానీ
కాలాన్నీ మార్చగలడా?!
కాలమెప్పుడూ పాతబడిపోదూ!
నిన్న, నేడు, రేపునంటూ
మనిషే దానిలో తేడా చూస్తాడు గానీ,
కాలాన్నీ ఆపగలడా?!
కాలమెప్పుడూ పాతబడిపోదూ!
తాను చేసే పొరపాట్లకు అసమర్ధతను
కాలము మీద నేరము మోపే మనిషి
కాలాన్ని అంచనా వేయ్యలేడు
కాలం బలిమి కుదిరితే
విర్రవీగడం కంటే
ఉన్నతి కాలం ఉన్నంత కాలం ఉన్నతంగా వుండటమూ
నేర్చుకోవాలి మనిషి!
– డా.ఐ. చిదానందం
8801444335




ఈ రోజుల్లో డొల్ల సాహిత్యం ఇలాగే అమ్ముడుపోతోంది నాగిని కందాల