జస్టిస్ యశ్వంత్ వర్మ రాజీనామా

– కాలిన నోట్ల కట్టల వ్యవహారంలో..

న్యూదిల్లీ, ఏప్రిల్ 10 : అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపారు. దిల్లీలోని తన నివాసంలో కాలిన నోట్ల కట్టలు దొరికిన ఘటనలో ఆయనను తొలగించేందుకు అభిశంసన ప్ర‌క్రియకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజా పరిణామం చోటుచేసుకుంది. గతేడాది మార్చి 14న దిల్లీ హైకోర్టు జడ్జిగా ఉన్న సమయంలో జస్టిస్ వర్మ నివాసంలో భారీగా నోట్ల కట్టలు బయటపడటం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీని ఫలితంగా 2025 జులైలో లోక్‌సభలో 145 మంది, రాజ్యసభలో 63 మంది ఎంపీలు ఆయనపై అభిశంసన తీర్మానానికి నోటీసులు ఇచ్చారు. దీంతో లోక్‌సభ స్పీకర్ ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఏర్పాటును జస్టిస్ వర్మ సుప్రీంకోర్టులో సవాలు చేశారు. అయితే, ఆయన పిటిషన్‌ను జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ సతీశ్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం తోసిపుచ్చింది. అంతకుముందు సుప్రీంకోర్టు అంతర్గత కమిటీ ఇచ్చిన నివేదికను సవాల్ చేసినా ఆయనకు చుక్కెదురైన విషయం తెలిసిందే. దీంతో ఇక లాభం లేదనుకుని ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *