– నోట్ల కట్టల కేసులో జస్టిస్ వర్మపై సుప్రీం ఆగ్రహం
న్యూదిల్లీి, జూలై30: నోట్ల కట్టల వ్యవహారంపై విచారణకు సుప్రీం కోర్టు నియమించిన త్రిసభ్య కమిటీ ఇచ్చిన నివేదికను సవాల్ చేస్తూ జస్టిస్ యశ్వంత్ వర్మ సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్‌పై బుధవారం విచారణ జరిగింది. నోట్ల కట్టలు వర్మవేనని కమిటీ తేల్చగా ఆయన తరఫున ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ వాదిస్తూ న్యాయమూర్తిని తొలగించాలని అంతర్గత విచారణ ప్యానెల్ చేసిన సిఫారసు రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ విూ ప్రవర్తన నమ్మశక్యంగా లేదని.. రాజ్యాంగ విరుద్ధమని భావిస్తే విచారణకు ఎందుకు హాజరయ్యారని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై ముందే సవాల్ చేయాల్సింది కదా అని అసహనం వ్యక్తం చేసింది. న్యాయపరమైన తప్పులు జరిగినప్పుడు చర్య తీసుకునే హక్కు చీఫ్ జస్టిస్‌కు ఉంటుందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది.




