చెప్ప‌డ‌మే.. పైస‌లు వేసుడు లేదు

– చిన్న కోడూరు రైతుల‌కు రూ.45 కోట్ల మాటేంటి?
– కాంగ్రెస్ బ‌ల‌ప‌ర‌చిన అభ్య‌ర్థుల‌ను ఓడించండి
– హ‌రీష్‌రావు పిలుపు

చిన్న‌కోడూరు, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 7: చిన్నకోడూరు లో 450మంది రైతులు 59రోజుల నుండి రూ.45కోట్లు రావాలని అంటున్నారు.  రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మాది రైతు ప్రభుత్వం అంటున్నారు.  ఉత్తం కుమార్ రెడ్డి రెండు రోజుల్లో డబ్బులు వేస్తున్నాము అంటున్నాడు.  కానీ 50రోజులు అయిన డబ్బులు రాలేద‌ని హ‌రీష్‌రావు ఆరోపించారు. ఆదివారం చిన్న కోడూరు మండల కేంద్రంలోని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆయ‌న సంద‌ర్శించారు. యాసంగి పంట పెట్టుబడి కోసం రైతులు మద్దతు ధర కు తక్కువ ధరకు అమ్ముతున్నారు.  వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా మొక్కజొన్న రైతులకు బకాయి పడ్డ రూ.450కోట్ల డబ్బులు విడుదల చేయాలి.  గతంలో కేసీఆర్ ప్రభుత్వం చీరెలు ఇచ్చింది రేవంత్ రెడ్డి ఒక్కసారి ఇచ్చి గొప్పలు చెప్పుకుంటున్నారు. రేవంత్ రెడ్డి ఓటు అడగాలి అంటే మహిళలకు బకాయి పడ్డ రూ.60వేలు డబ్బులు ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు.  కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను చిత్తు చిత్తు గా ఓడించాల‌ని పిలుపునిచ్చారు. రైతులకు బోనస్ పడాలి అంటే కాంగ్రెస్ ను ఓడించాల‌న్నారు. వచ్చే ఏడాది నుండి పంట వేస్తేనే రైతు బంధు ఇస్తామని తుమ్మల నాగేశ్వరరావు అంటున్నారు. నేటికి పూర్తి స్థాయిలో రైతులకు రుణమాఫీ కాలేదు. కాళేశ్వరం కూలిందని, కెసిఆర్,  హరీష్ రావు లను బండకేసి కొట్టాలి అన్న రేవంత్ రెడ్డి మాట్లాడిండు. రేవంత్ రెడ్డి సిద్దిపేటకు రా  రంగనాయక సాగర్ లో బండ కట్టి నిన్ను ఎత్తేస్తా.. నువ్ మునుగోలుతవో,  తేలుతావో చూద్దామ‌న్నారు. రంగనాయక సాగర్ లో నీళ్ళుండి నువ్ మునిగితే కాళేశ్వరం ఉన్నట్టు,  నువ్ తేలితే కాళేశ్వరం కూలినట్టు అన్నారు.  రేవంత్ రెడ్డివి అన్నీ అబద్ధాలు..  ఆయన చిల్లర మాటలు మానుకోవాల‌ని హిత‌వు ప‌లికారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page