– ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య
– యాదగిరిగుట్టలో కాంగ్రెస్ విజయోత్సవ ర్యాలీ
యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, నవంబర్ 14 : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించిన నేపథ్యంలో యాదగిరిగుట్ట పట్టణంలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. ఎమ్మెల్యే ఐలయ్య బ్యాండ్ వాయించి బాణసంచా కాల్చారు. నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సంబరాల్లో పాల్గొన్నారు. అనంతరం అయిలయ్య మాట్లాడుతూ జూబ్లీహిల్స్ విజయం ప్రజాపాలనకు నిదర్శనమన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందజేస్తున్నదన్నారు. వచ్చే సార్వత్రక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరిన్ని సీట్లు గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
పాత గుట్ట రోడ్డులో మార్నింగ్ వాక్
యాదగిరిగుట్టలో ఎమ్మెల్యే ఐలయ్య తన నివాసం నుండి మెయిన్ రోడ్డు మీదుగా పాత గుట్ట ఆలయం వరకు మార్నింగ్ వాక్ చేశారు. స్థానిక ప్రజలతో మాట్లాడి పట్టణం నుండి పాత గుట్ట రోడ్డు పనులను ప్రారంభించగా రోడ్డు వెడల్పు, అక్కడి సమస్యలను తెలుసుకున్నారు. వెంటనే వారి సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. రోడ్డు వెడల్పులో పాత గుట్ట ప్రజలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చైతన్య మహేందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ లింగస్వామి, తహసిల్దార్ గణేష్ నాయక్, టౌన్ సీఐ భాస్కర్, పార్టీ మండల అధ్యక్షుడు మంగ సత్యనారాయణ, మాజీ ఎంపీపీ చీర శ్రీశైలం, పార్టీ సీనియర్ నాయకుడు గుండ్లపల్లి భరత్ గౌడ్, మాజీ ధర్మకర్త పెళ్లిమెల్లి శ్రీధర్ గౌడ్, టౌన్ అధ్యక్షుడు భిక్షపతి, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





