– ఓడితే పది ఊడడం ఖాయం
– ఇక్కడ గెలిపించేది హైదరాబాద్ అభివృద్దే
– విూడియా సమావేశంలో మాజీమంత్రి జగదీశ్ రెడ్డి
హైదరాబాద్,ప్రజాతంత్ర, నవంబర్ 8:ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిలో భయం మొదలైందని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల తర్వాత పదవీగండం పొంచి ఉందని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్ అభివృద్ధి అజెండాపైనే జూబ్లీహిల్స్ ప్రజలు ఓటు వేయబోతున్నారని పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ నేతలతో కలిసి నిర్వహించిన విూడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మాగంటి గోపీనాథ్ తల్లితో ఎవరు మాట్లాడిస్తున్నారో అందరికీ తెలుసునన్నారు. రేవంత్ రెడ్డి ఓటమి భయంతో చేసే పనుల్లో ఇది ఒకటని, రేవంత్ రెడ్డి డ్రగ్స్ మత్తులో మాట్లాడుతున్నట్లుగా ఉందన్నారు. రేవంత్ సీఎంగా వచ్చాక డ్రగ్స్ సంబంధ నేరాలు ఎక్కువయ్యాయని., పోలీస్ కమిషనర్లే నేరాల రేటు పెరిగిందని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. కేసీఆర్ హయాంలో డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపారన్నారు. సీఎం మానసిక స్థితి దెబ్బతిన్నట్లుందని.. సందర్భం లేకుండా మాట్లాడుతున్నారని, సిగ్గు సిగ్గుపడేలా ఉందని విమర్శించారు. నిఘా పెట్టేందుకు కేసీఆర్ కమాండ్ కంట్రోల్ కడితే రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్‌లో కూర్చొని తమపై నిఘా పెడుతున్నాడని న్నారు. ప్రగతిభవన్‌లో బుల్లెట్ ప్రూఫ్ కిటికీలు ఉంటే చూపించాలని సవాల్ విసిరారు. బుల్లెట్ ప్రూఫ్ కిటికీలు, కమాండ్ కంట్రోల్, సెక్రటేరియట్‌పై కమిషన్ వేయవచ్చు కదా.. బుల్లెట్ ప్రూఫ్ కిటికీలు చూపిస్తావా ప్రగతి భవన్‌ల ఎన్ని రూములున్నాయో చూపిస్తావా అంటూ ప్రశ్నించారు. దేశంలో ఎవరూ తిట్టని విధంగా వైఎస్సార్‌ను, సోనియా గాంధీని తిట్టింది రేవంత్‌రెడ్డియేననన్నారు. ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలను ఎన్ని రోజులు భయపెడతావంటూ నిలదీశారు. ఏం చేసినా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలవదని, రేవంత్ రెడ్డి చేసే తప్పులకు చరిత్ర క్షమించదన్నారు. కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి పదవుల్లో ఉన్నారు కాబట్టి.. ఇద్దరు బ్యాడ్ బ్రదర్స్ అన్నారు. తెలంగాణ అభివృద్ధి,హైదరాబాద్ అభివృద్ధి బాధ్యత రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి, బండి సంజయ్ తీసుకోవాలని సూచించారు. హరీశ్‌రావుపై రేవంత్ చల్లర వ్యాఖ్యలు చేశారంటూ విమర్శించారు. ఇప్పటికైనా ఆయన తన భాష మార్చుకుంటే మంచిదంటూ హితవు పలికారు. సమావేశంలో మాజీ ఎంపీ లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, గాదరి కిషోర్ కుమార్, బూడిద భిక్షమయ్య గౌడ్, బీఆర్‌ఎస్ నేతలు చింతల వెంకటేశ్వర్ రెడ్డి, దయాకర్‌రెడ్డి పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





