రేపు జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక

– పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి
– పోలింగ్‌ కేంద్రాలకు తరలిన ఎన్నికల సిబ్బంది
– డ్రోన్ల ద్వారా పోలింగ్‌ కేంద్రాల పర్యవేక్షణ
– 407 కేంద్రాలు ఏర్పాటు.. 226 సమస్యాత్మక కేంద్రాలు
– డ్రోన్ల ద్వారా పోలింగ్‌ కేంద్రాల పర్యవేక్షణ

హైదరాబాద్‌, నవంబర్‌ 10: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. మంగళవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. నియోజకవర్గంలో మొత్తం 4,01,365 మంది ఓటర్లు ఉన్నారు. 58 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉండగా 139 ప్రాంతాలలో 407 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్కో పోలింగ్‌ కేంద్రంలో నాలుగు ఈవీఎంలను, ఒక వీవీ ప్యాట్‌ను, ఒక కంట్రోల్‌ యూనిట్‌ను ఏర్పాటు చేశారు. కోట్ల విజయ భాస్కర్‌ రెడ్డి స్టేడియంలో ఎన్నికల సిబ్బందికి ఈవీఎంలు, పోలింగ్‌ సామగ్రిని అధికారులు పంపిణీ చేయగా వాటిని పోలింగ్‌ కేంద్రాలకు తరలించారు. ఎన్నికల నిర్వహణ కోసం 2,060 మంది శిక్షణ పొందిన పోలింగ్‌ సిబ్బంది (పీఓ/ఏపీఓ/ఓపీఓలు) సిద్ధంగా ఉన్నారు. రెండు వేల మంది పోలీసులతో కలిపి మొత్తం ఐదు వేల మంది ఉప ఎన్నిక విధుల్లో ఉన్నారు. 226 పోలింగ్‌ కేంద్రాను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో 144వ సెక్షన్‌ విధించారు. 68 క్రిటికల్‌ లొకేషన్‌లలో సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ను నియమించారు. 45 ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లను ఏర్పాటు చేశారు. ఈసారి డ్రోన్ల ద్వారా పోలింగ్‌ కేంద్రాల పర్యవేక్షణ జరుగనుంది. 100 శాతం పోలింగ్‌ స్టేషన్లలో వెబ్‌-కాస్టింగ్‌ ద్వారా పోలింగ్‌ను ప్రత్యక్షంగా పర్యవేక్షించనున్నారు. ఈవీఎంల రవాణాకు జీపీఎస్‌ టెక్నాలజీని ఉపయోగించి పటిష్టమైన భద్రతతోపాటు రియల్‌-టైమ్‌ పర్యవేక్షణ చేపట్టనున్నారు.

వోటర్లకు సౌకర్యాలు

అన్ని పోలింగ్‌ స్టేషన్లు కింది అంతస్తులోనే ఏర్పాటు చేశారు. వోటర్ల కోసం తాగునీరు, మరుగుదొడ్లు, ర్యాంపులు, కూర్చోవడానికి సీట్లు, సరైన లైటింగ్‌తో కూడిన కనీస హామీ సౌకర్యాలు కల్పించారు. మహిళలు, వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేసి వలంటీర్లను నియమించారు. అన్ని కేంద్రాలలో మొబైల్‌ ఫోన్లు డిపాజిట్‌ చేసేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. 103 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు పోలయ్యాయి. సమస్యాత్మక ప్రాంతాల్లో ఇప్పటివరకు 230మంది రౌడీ షీటర్లను బైండోవర్‌ చేశారు. ఎంసీసీ నిబంధనలు అతిక్రమించిన 27మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. కాగా, ప్రధానంగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. బీఆర్‌ఎస్‌ నుంచి మాగంటి గోపినాథ్‌ భార్య మాగంటి సునీత బరిలో ఉండగా కాంగ్రెస్‌ అభ్యర్థిగా నవీన్‌ యాదవ్‌, బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్‌ రెడ్డి పోటీలో ఉన్నారు. ఎలాగైనా ఉప ఎన్నికలో గెలవాలని బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీల నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. జూబ్లీహిల్స్‌ ప్రజలు ఎవరికి పట్టం కట్టనున్నారో చూడాలి. 14వ తేదీన ఓట్ల లెక్కింపు కూడా స్టేడియంలోనే జరుగుతుంది.

అందరూ ఓటు హక్కు వినియోగించుకోవోలి: సీఈవో

ఉప ఎన్నికకు సంబంధించిన ఏర్పాట్లు పటిష్టంగా సమగ్రంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. పోలింగ్‌ ప్రక్రియను సజావుగా, సురక్షితంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. అన్ని పోలింగ్‌ కేంద్రాలలో కనీస సౌకర్యాలు ఏర్పాటు చేసి, తగిన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశామని ముఖ్య ఎన్నికల అధికారి (సీఈవో) సి.సుదర్శన్‌ రెడ్డి చెప్పారు. 68 కీలక ప్రదేశాలలో సీఆర్‌పీఎఫ్‌ సిబ్బందిని మోహరించాం. వంద శాతం పోలింగ్‌ స్టేషన్లలో వెబ్‌-కాస్టింగ్‌, డ్రోన్‌ నిఘా ద్వారా పర్యవేక్షణ జరుగుతుంది. ఏవైనా ఫిర్యాదులు ఉంటే వోటర్లు 1950 నంబర్‌కు సంప్రదించవచ్చు. జూబ్లీహిల్స్‌లోని పౌరులందరూ బాధ్యతాయుతంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతున్నామన్నారు. కాగా, mబీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. బీఆర్‌ఎస్‌ నుంచి మాగంటి గోపినాథ్‌ భార్య మాగంటి సునీత బరిలో ఉండగా కాంగ్రెస్‌ అభ్యర్థిగా నవీన్‌ యాదవ్‌, బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్‌ రెడ్డి పోటీలో ఉన్నారు. ఎలాగైనా ఉప ఎన్నికలో గెలవాలని బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీల నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *