– కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో రేపు లెక్కింపు
– పోస్టల్ బ్యాలెట్‌తో ప్రారంభం
– 42 టేబుళ్లు ఏర్పాటు చేసినట్లు ఆర్వో కర్ణన్ వెల్లడి
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 13: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని ఆర్.ఒ కర్ణన్ తెలిపారు. యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఇండోర్ స్టేడియంలోని డీఆర్సీ సెంటర్‌లో గురువారం నిర్వహించిన విూడియా సమావేశంలో మాట్లాడారు. మొత్తం 58 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నందున ప్రత్యేక అనుమతి తీసుకుని లెక్కింపునకు 42 టేబుళ్లు ఏర్పాటు చేశారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్‌తో ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని, ఉప ఎన్నికలో 407 పోలింగ్ కేంద్రాల్లో 1,94,632 ఓట్లు పోలవ్వగా వీటిని పది రౌండ్లుగా 42 టేబుళ్లపై లెక్కింపు జరుపనున్నట్లు కర్ణన్ తెలిపారు. కౌంటింగ్‌కు మొత్తం 186 మంది సిబ్బందిని కేటాయించామన్నారు. ఫలితాలను ఎప్పటికప్పుడు ఈసీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తామన్నారు. విూడియాకు ప్రత్యేకంగా ఎల్‌ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేసి ఫలితాలను వెల్లడిస్తామని చెప్పారు. తొలుత పోస్టల్ బ్యాలెట్, తర్వాత 103 హోం ఓటింగ్‌లను లెక్కించిన తర్వాత ఈవీఎంల్లోని ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. సాధారణంగా 14 టేబుళ్లపై కౌంటింగ్ జరుగుతుంది. ఉప ఎన్నిక కావడం, ఉద్యోగులు అందుబాటులో ఉండడంతో ఎక్కువ టేబుళ్లు ఏర్పాటు చేసి త్వరగా లెక్కింపు పూర్తి చేయాలని నిర్ణయించారు. ఉదయం 8.45 గంటలకల్లా తొలి రౌండ్ ఫలితం వెల్లడి కానుంది. మధ్యాహ్నం ఒంటి గంటలోపే తుది ఫలితాన్ని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తున్నది. నోటాకు పోలైన ఓట్ల సంఖ్యనూ అధికారులు వెల్లడిరచనున్నారు. కాగా, కౌంటింగ్ కేంద్రంలో పటిష్టమైన మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. దీనికితోడు సీసీ కెమెరాలతో పర్యవేక్షణ, సాయుధ బలగాలతో 24 గంటల పహారా ఉండనుంది. కాగా, ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద 250 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామని నగర జాయింట్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ తెలిపారు. 15 ప్లాటూన్ల సిబ్బందిని రప్పిస్తున్నామన్నారు. 144వ సెక్షన్ అమల్లో ఉంటుందని, అనుమతి ఉన్నవారు మాత్రమే లెక్కింపు కేంద్రం వద్దకు రావాలని సూచించారు. శాంతిభద్రతలకు భంగం వాటిల్లితే చర్యలు తప్పవని హెచ్చరించారు. స్టేడియానికి 100 విూటర్ల మేరలో ఆంక్షలు ఆమల్లో ఉంటాయని తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





