జూబ్లీహిల్స్‌ ఎన్నికపై సీఎం రేవంత్‌ కసరత్తు

– ఆయనతో మంత్రులు, పీసీసీ చీఫ్‌ భేటీ
– గెలుపు గుర్రాలతో జాబితాకు సిఎం ఆదేశం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 1 : జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికకు సంబంధించి కాంగ్రెస్‌ పార్టీ కసరత్తు ప్రారంభించింది. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌తోపాటు జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక షెడ్యూల్‌ కూడా వస్తుంది కాబట్టి కాంగ్రెస్‌ పార్టీ తమ అభ్యర్థి ఎంపికపై ఫోకస్‌ పెట్టింది. ఇందులో భాగంగానే బుధవారం ఉదయం సీఎం రేవంత్‌ రెడ్డితో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, మంత్రి పొన్నం ప్రభాకర్‌ భేటీ అయ్యారు. ఈ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికల అభ్యర్థులతోపాటు జూబ్లీహిల్స్‌ అభ్యర్థిపై చర్చ జరిగింది. ఈ నెల 6న ఏఐసీసీలో స్క్రీనింగ్‌ కమిటీ సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో ఆ సమావేశానికి ముందే అభ్యర్థుల ఎంపికను పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ఉప ఎన్నికకు కాంగ్రెస్‌ అభ్యర్థి ఎంపికపై ఆయన సవిూక్షించారు. దీనిపై నివేదిక ఇవ్వాలని ముగ్గురు మంత్రులకు ఆయన సూచించారు. తాజా రాజకీయ పరిస్థితులను వివరిస్తూ నివేదికలో అభ్యర్థుల పేర్లు, వివరాలు ఉండాలని పేర్కొన్నారు. గెలుపు గుర్రాన్ని నిలబెట్టాలన్న కోణంలోనే నివేదిక ఉండాలని సీఎం పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికశాతం స్థానాలను కైవసం చేసుకోవాలని స్పష్టం చేశారు. ఈ అంశంలో ఇన్‌చార్జి మంత్రులతోపాటు ఎంపీల భాగస్వామ్యంతో వెళ్లాలని సూచించారు. సీఎం రేవంత్‌రెడ్డితో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ కూడా సమావేశమై ఈ అంశంపై చర్చించారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికకు సంబంధించి మంత్రులు పొన్నం ప్రభాకర్‌, వివేక్‌, తుమ్మల నాగేశ్వరరావు జిల్లా ఇన్‌చార్జిలుగా ఉన్నారు. టికెట్‌ ఆశిస్తున్న అభ్యర్థుల జాబితాను సిద్ధం చేయాలని జిల్లా ఇన్‌చార్జిలను సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. అలానే గెలుపు కోసం అనుసరించే ప్రణాళికలను కూడా సిద్ధం చేయాలన్నారు. బీసీ కోటాలో అంజన్‌ కుమార్‌ యాదవ్‌, నవీన్‌ యాదవ్‌, బొంతు రామ్మోహన్‌ రేస్‌లో ఉన్నారు. రెడ్డి కోటాలో సీఎస్‌ రెడ్డి, రంజిత్‌ రెడ్డిలు ఉన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *