– వోటర్ల ముసాయిదా జాబితా విడుదల చేసిన ఈసీ
హైదరాబాద్, ప్రజాతంత్ర,సెప్టెంబర్ 2 : జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నికల సన్నాహాలు మొదలయ్యాయి. ఇటీవల ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మరణంతో ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు తప్పనిసరి అయ్యాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం జూబ్లీహిల్స్ నియోజకవర్గం వోటర్ల ముసాయిదా జాబితాను విడుదల చేసింది. మొత్తం 3,92,669 మంది వోటర్లు ఈ జాబితాలో ఉన్నారని అధికారులు వెల్లడించారు. ఇందు లో పురుష వోటర్లు 2,04,288 మంది, మహి ళా వోటర్లు 1,88,356 మంది కాగా, మూడవ లింగానికి చెందిన వారు 25 మంది ఉన్నారు. ఈ నియోజకవర్గంలో 139 లొకేషన్లలో 407 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు సమాచారం. ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు, మార్పులు, చేర్పులు, కొత్త వోటర్ల నమోదు కోసం సెప్టెంబర్ 17 వరకు అవకాశం కల్పించారు. సెప్టెంబర్ 25లోపు ఫిర్యాదులు, అర్జీల పరిష్కారం పూర్తి చేయనున్నారు. అనంతరం సెప్టెంబర్ 30, 2025న తుది ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల దృష్ట్యా ఈ వోటర్ల జాబితా అత్యంత కీలకంగా భావిస్తున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





