అర్థరాత్రి జర్నలిస్టుల అరెస్ట్ ‌దారుణం

– రాష్ట్రంలో ఎమర్జెన్సీని తలపిస్తున్న కాంగ్రెస్‌ ‌పాలన
– బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌

‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 14:సంక్రాంతి పండుగవేళ జర్నలిస్టులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌ఖండించారు.  కాంగ్రెస్‌ ‌పాలన అనుక్షణం ఎమర్జెన్సీని గుర్తుచేస్తోందని విమర్శించారు. డీజీపీ జర్నలిస్టులను నేరస్తులా ట్రీట్‌ ‌చేయడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. మీరు ముందుగా వారికి నోటీసులు జారీ చేసి విచారణకు పిలవాల్సిందని కేటీఆర్‌ అన్నారు. రాత్రిపూట జర్నలిస్టుల ఇళ్లపై దాడి సబబు కాదన్నారు. జర్నలిస్టులను తక్షణమే విడుదల చేయాలని తాను డిమాండ్‌ ‌చేస్తున్నానన్నారు. వారిపై ఏ నాన్‌ బెయిలబుల్‌ ‌సెక్షన్‌ల కింద కేసులు నమోదు కాలేదని, అలాంటప్పుడు అర్ధరాత్రి అరెస్టులతో పోలీసులు జర్నలిస్టులను, వారి కుటుంబాలను ఎందుకు భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ప్రశ్నించారు. జర్నలిస్టులను వెంటనే విడుదల చేసి వారి విషయంలో చట్టపరంగా నడుచుకోవాలని డీజీపీని కోరుతున్నాన్నారు. కాంగ్రెస్‌ ‌పార్టీకి, ఆ పార్టీకి నీచ నాయకత్వానికి అనుగుణంగా మురికి రాజకీయాలు చేయవద్దని ఆయన సూచించారు. అసలు ఈ విషయాన్ని లీక్‌ ‌చేసింది ఎవరు? మిస్టర్‌ 30 ‌పర్సెంట్‌ ‌సపోర్టు లేకుండా ప్రభుత్వ అనుకూల టీవీ ఛానెల్‌ ఈ అం‌శాన్ని ప్రసారం చేసిందని మీరు భావిస్తున్నారా అని ప్రశ్నించారు.

రాజకీయ క్రీడలో భాగంగానే.. : ఎమ్మెల్యే పల్లా ఆగ్రహం

ఎన్‌టీవీ జర్నలిస్టుల అక్రమ అరెస్ట్ ‌ను ఖండిస్తున్నామని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌ ‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం తమ రాజకీయ క్రీడలో భాగంగా నచ్చిన వారిని మంత్రులను చేయడానికి టీవీ చానెళ్లకు లీకులు ఇచ్చి ఉపయోగించుకొని మరల వారి మీదనే సిట్‌ ‌వేసి అరెస్టులకు పాల్పడుతుందని ఆరోపించారు. అర్ధరాత్రి అక్రమంగా ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా తలుపులు బద్దలు కొట్టి ఇంట్లోకి వెళ్లి అరెస్ట్ ‌చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. జరుగుతున్న పరిణామాలన్నీ డ్రామాలని యావత్‌ ‌ప్రజలకు తెలుసనీ, ఎమర్జెన్సీని తలపించే విధంగా కాంగ్రెస్‌ ‌ప్రభుత్వ చర్యలు ఉన్నాయని మండిపడ్డారు. అరెస్ట్ ‌చేసిన వారిని బేషరతుగా వెంటనే విడుదలచేయాలి డిమాండ్‌ ‌చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *