– మాజీ మంత్రి జోగు రామన్న హౌస్ అరెస్ట్
ఆదిలాబాద్, ప్రజాతంత్ర, జనవరి 16: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లా పర్యటన నేపథ్యంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి జోగు రామన్నను శుక్రవారం హౌస్ అరెస్టు చేశారు. ఆయనతో పాటు పలువురు బీఆర్‌ఎస్ నేతలను హౌస్ అరెస్టు చేశారు. వీరి అరెస్టులతో జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా జోగు రామన్న మాట్లాడుతూ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చనాకా కొరాటా ప్రాజెక్టు ట్రయల్ రన్‌కు రావడం సిగ్గుమాలిన చర్య అని విమర్శించారు. ఆదిలాబాద్ జిల్లా రైతాంగానికి 50 వేల ఎకరాలకు నీరు అందించాలన్న సంకల్పంతో బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ పూర్తిస్థాయిలో ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టారని తెలిపారు. కానీ బూటకపు హావిూలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఎకరాకు కూడా నీరు అందించకుండా ట్రయల్ రన్ చేయడం, దాన్ని ప్రారంభించడం సిగ్గుమాలిన చర్య అని విమర్శించారు. సీఎం పర్యటన నేపథ్యంలో శనివారం అర్ధరాత్రి నుంచే పోలీసులు ముందస్తు అరెస్టులు చేయడం అప్రజాస్వామికం అని ఆయన మండిపడ్డారు. భేలా, జైనత్, ఆదిలాబాద్ మండల నాయకులను ఎక్కడికక్కడ అరెస్టులు చేయడం సమంజసం కాదన్నారు. ఒక్క ఎకరాకు కూడా నీరు అందించలేని ముఖ్యమంత్రి రేవంత్ పర్యటనను రైతులు వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. రైతు సమస్యలు పరిష్కరించడంపై ధ్యాస లేని ఈ ముఖ్యమంత్రి కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ట్రయల్ రన్ అంటూ మోసం చేస్తున్నారని మండిపడ్డారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





