– 100 పోస్టుల భర్తీ
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 30: ఉస్మానియా యూనివర్సిటీలోని ఎంప్లాjáYTమెంట్ బ్యూరో/ఎంసీసీ ఆధ్వర్యంలో మెడ్‌ప్లస్ గ్రూప్ ఆధ్వర్యంలో ఈ నెల 31న ఉదయం 11 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నది. ఉస్మానియా యూనివర్సిటీ, ఆర్ట్స్ కాలేజీ ఎదురుగా ఉన్న ఎంప్లాjáYTమెంట్ బ్యూరో యూఈఐజీబీ-ఎంసీసీ కార్యాలయంలో ఈ జాబ్ మేళా నిర్వహించనున్నారు. మెడ్‌ప్లస్ గ్రూప్‌లోని ఫార్మాసిస్టు, అసిస్టెంట్‌లకు చెందిన 100 పోస్టులను ఈ జాబ్ మేళా ద్వారా భర్తీ చేయనున్నారు. డీ ఫార్మసీ బీ ఫార్మసీ, ఎం.ఫార్మసీ, ఏదేని డిగ్రీ చేసిన యువతీయువకుల” 18 నుండి 30 సంవత్సరాల వయసు వారికి మాత్రమే ఈ జాబ్ మేళాలో అవకాశం కల్పిస్తున్నట్లు యూనివర్సిటీ ఎంప్లాjáYTమెంట్ ఇన్ఫర్మేషన్ గైడెన్స్ బ్యూరో చీఫ్ రాము ఒక ప్రకటనలో తెలిపారు. ఫార్మసిస్టుకు నెలకు రూ.19,000 వేలు, అసిస్టెంట్ ఫార్మసిస్ట్‌కు రూ.12,756 వరకు వేతనం ఉంటుంది. మరిన్ని వివరాలకు సాయి శైలేష్, హెచఆర్, ఫోన్ 9666662481ను సంప్రదించాలని, విద్యార్హతల సర్టిఫికెట్ల జిరాక్స్‌తో ఉస్మానియా యూనివర్సిటీ ఎంప్లాjáYTమెంట్ బ్యూరో వద్ద నేరుగా 31న హాజరు కావాలని కోరారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





