28న అప్రెంటిస్ ట్రైనీ పోస్టులకు జాబ్ మేళా

– 100 పోస్టుల భర్తీ

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 23: ఉస్మానియా యూనివర్సిటీలోని ఎంప్లాయ్‌మెంట్‌ బ్యూరో ఆధ్వర్యంలో భగవతి ప్రొడక్ట్స్ లిమిటెడ్, ఫాబ్ సిటి రంగారెడ్డి ఆధ్వర్యంలో వంద అప్రెంటిస్ ట్రైనీ పోస్టుల భర్తీకి ఈ నెల 28న జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ఎదురుగా ఉన్న  ఎంప్లాయ్‌మెంట్‌ బ్యూరో కార్యాలయంలో ఆ రోజు ఉదయం 11 గంటలకు ఈ జాబ్ మేళా నిర్వహించనున్నారు. బీటెక్ ఈఈఈ, ఈసీఈ, డిప్లోమా ఈఈఈ, ఈసీఈ చేసిన యువతీ యువకులు 18 నుండి 35 సంవత్సరాల వయసు వారికి మాత్రమే ఈ జాబ్ మేళాలో అవకాశం కల్పిస్తున్నట్లు యూనివర్సిటీ ఎంప్లాయ్‌మెంట్‌ ఇన్ఫర్మేషన్ బ్యూరో డిప్యూటీ చీఫ్ ఒక ప్రకటనలో తెలిపారు. రూ.15,750 వరకు వేతనం ఉంటుందని, మరిన్ని వివరాలకు  హెచఆర్ స్పందన రెడ్డి (ఫోన్ 9100877349)ను సంప్రదించాలని ఆ ప్రకటనలో కోరారు. విద్యార్హతల సర్టిఫికెట్ల జిరాక్స్‌తో ఉస్మానియా యూనివర్సిటీ ఎంప్లాయ్‌మెంట్‌ బ్యూరో(యూఈఐ అండ్ జీబీ/ఎంసీసీ) వద్ద నేరుగా 28వ తేదీన హాజరు కావాలని కోరారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *