సిద్దిపేట యువతకు ఉపాధి అవకాశం

– వచ్చే నెలలో భారీ జాబ్ మేళా
– పాల్గొననున్న‌ 20కి పైగా కంపెనీలు
– 18 ఏళ్లు పైబడిన వారందరికీ అవకాశం
– సిద్దిపేట కమిషనర్ సాధన రష్మీ

సిద్దిపేట, ప్రజాతంత్ర మార్చి 16: సిద్దిపేట జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వచ్చే నెలలో భారీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు సిద్దిపేట పోలీస్ కమిషనర్ సాధన రష్మీ పెరుమాళ్ళు తెలిపారు.   కమిషనరేట్ కార్యాలయంలో జిల్లాలోని పలు ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో ఆమె సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం లక్ష్యంగా ఈ జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే 20కి పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొనడానికి ముందుకు వచ్చాయని పేర్కొన్నారు. 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు ఎవరైనా ఈ జాబ్ మేళాకు హాజరుకావచ్చని అన్నారు. ఏ విద్యార్హత ఉన్న వారైనా తమ నైపుణ్యానికి అనుగుణంగా ఉద్యోగ అవకాశాలు పొందేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. సామాజిక బాధ్యతగా యువతకు అండగా నిలవాలనుకునే మరిన్ని సంస్థలు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని, ఆసక్తి గల కంపెనీలు సిద్దిపేట పోలీసులను సంప్రదించాలని సీపీ కోరారు.

నెలాఖరులో రిజిస్ట్రేషన్ లింక్ 

జాబ్ మేళాలో పాల్గొనదలిచిన అభ్యర్థులు తమ పేరు, విద్యార్హత వివరాలతో ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ లింక్ ఈ నెల చివర్లో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. జిల్లాలోని యువత తమ ప్రతిభను చాటుకుని జీవితంలో స్థిరపడాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని, నిరుద్యోగులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సీపీ రష్మీ పెరుమాళ్ సూచించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *