ఈ నెల 22న జాబ్‌ మేళా

– బీటెక్‌, డిప్లమా మెకానికల్‌ & డీజిల్‌ మెకానికల్‌ ఐటిఐతో భర్తీ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 19 : ఉస్మానియా యూనివర్సిటీలోని ఎంప్లాయ్‌మెంట్‌ బ్యూరో ఆధ్వర్యంలో మిత్రా ఏరిన ఆటోమొబైల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఈ నెల 22వ తేదీ ఉదయం 11 గంటలకు జాబ్‌ మేళా నిర్వహించనున్నది. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్‌ కాలేజీ ఎదురుగా ఉన్న ఎంపాయ్‌మెంట్‌ బ్యూరో కార్యాలయంలో ఈ జాబ్‌ మేళాను నిర్వహించనున్నారు. మిత్రా ఏరిన ఆటోమొబైల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లోని(టెక్నీషియన్‌ అండ్‌ సర్వీస్‌ అడ్వైజర్‌) 25 పోస్టులను దీని ద్వారా భర్తీ చేయనున్నారు. డిగ్రీ చేసిన యువతీయువకులు 18 నుండి 30 సంవత్సరాల వయసు వారికి మాత్రమే అవకాశం కల్పిస్తున్నట్లు యూనివర్సిటీ ఎంప్లాయ్‌మెంట్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో డిప్యూటీ చీఫ్‌ ఒక ప్రకటనలో తెలియజేశారు. రూ.15,000 నుండి రూ.25,000 వేల వరకు వేతనం ఉండే ఈ టెక్నీషియన్‌ అండ్‌ సర్వీస్‌ అడ్వైజర్స్‌ ఉద్యోగాలకు మరిన్ని వివరాలకు హెచ్‌ఆర్‌ ఫోన్‌ నెం.7799884996, 7799464344)ను సంప్రదించాలని కోరారు. విద్యార్హతల సర్టిఫికెట్ల జిరాక్స్‌తో ఉస్మానియా యూనివర్సిటీ ఎంప్లాయ్‌మెంట్‌ బ్యూరో,(యూఈఐ అండ్‌ జీబీ/ఎంసీసీ) వద్ద నేరుగా ఈనెల 22 న హాజరు కావాలని తెలిపారు


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page