19న జాబ్‌ మేళా

– ఉస్మానియా ఎంప్లాయ్‌మెంట్‌ బ్యూరో ఆధ్వర్యంలో

–  40 సీనియర్‌ రిలేషన్‌షిప్‌ మేనేజర్‌ పోస్టులకు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 13: ఉస్మానియా యూనివర్సిటీలోని ఎంప్లాయ్‌మెంట్‌ బ్యూరో ఆధ్వర్యంలో మిత్రా ఎరీనా ఆటోమొబైల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో ఈ నెల 19న జాబ్‌ మేళా నిర్వహించనున్నట్లు బ్యూరో ఒక ప్రకటనలో తెలిపింది. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్‌ కాలేజీ ఎదురుగా ఉన్న ఎంప్లాయ్‌మెంట్‌ బ్యూరో కార్యాలయంలో ఉదయం 11 గంటలకు జరుగు ఈ జాబ్‌ మేళాలో మిత్రా ఎరీనా ఆటోమొబైల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లోని సీనియర్‌ రిలేషన్‌షిప్‌ మేనేజర్‌ 40 పోస్టులను భర్తీ చేయనున్నారు. డిగ్రీ చేసిన యువతీయువకులు 18 నుండి 30 సంవత్సరాల వయసు వారికి మాత్రమే అవకాశం కల్పిస్తున్నట్లు యూనివర్సిటీ ఎంప్లాయ్‌మెంట్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో డిప్యూటీ చీఫ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. రూ.15,000 నుండి రూ.20,000 వేల వరకు వేతనం ఉండే ఈ ఉద్యోగాలకు సంబంధించి మరిన్ని వివరాలకు శిరీష, హెచ్‌ఆర్‌ను ఫోన్‌ నంబరు 7799884909లో సంప్రదించాలని ఆ ప్రకటనలో కోరారు. విద్యార్హతల సర్టిఫికెట్ల జిరాక్స్‌తో ఉస్మానియా యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్‌ బ్యూరో వద్ద నేరుగా 19వ తేదీన హాజరు కావాలని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *