జర్నలిస్టుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత

– మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన జర్నలిస్టు సంఘాలు

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 27: రాష్ట్రంలో పాత్రికేయుల సంక్షేమం, భద్రత, వృత్తి గౌరవాన్ని కాపాడేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి ఆలోచనకు అనుగుణంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, ‌సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. పాత్రికేయుల అక్రిడిటేషన్‌ అం‌శంపై అన్ని పాత్రికేయ సంఘాల సూచనలు, సలహాలు పరిగణనలోకి తీసుకుని గతంలో విడుదల చేసిన జీ.ఓ.లో మార్పులు చేర్పులు చేసి కొత్త  జీ.ఓ.ను జారీ చేశామని తెలిపారు. జర్నలిస్టుల  సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని అన్నారు. మంగళవారం నాడు సచివాలయంలో పలు జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు మంత్రిగారి కృతజ్ఞతలు తెలిపారు. తమ  ప్రభుత్వం ఎలాంటి భేషజాలకు పోకుండా అందరికి న్యాయం జరిగేలా నిర్ణయాలు తీసుకుంటుందని అన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *