– మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి భావోద్వేగం
– ఎర్రవెల్లిలో స్వాగతం పలికిన కేటీఆర్, ముఖ్య నేతలు
– కేసీఆర్‌తో జీవన్ రెడ్డి మర్యాదపూర్వక భేటీ
– ఇష్టాగోష్ఠి అనంతరం లంచ్‌కు ఆహ్వానం
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 10: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి ఎర్రవెల్లిలోని బీఆరఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసానికి శుక్రవారం చేరుకోగా ఆయనకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుష్పగుచ్ఛాలందించి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రులు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్.రమణ, ఎమ్మెల్యే డాక్టర్ కె.సంజయ్, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే కె.విద్యాసాగర్ రావు, పార్టీ నేతలు గ్యాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డి తదితరులు అక్కడ ఉన్నారు. జీవన్ రెడ్డితోపాటు వచ్చిన వారిలో ఆయన కుమారులు, జగిత్యాల మాజీ జడ్పీ చైర్‌పర్సన్ వసంత సురేశ్ దంపతులు తదితరులున్నారు. ఈ సందర్భంగా జీవన్‌రెడ్డి మాట్లాడుతూ అన్నా.. నన్ను మీతో కలిసి పనిచేయమని దేవుడే పంపిండు అని భావోద్వేగానికి గురయ్యారు. నిరంతరం తన నియోజకవర్గం, జిల్లా ప్రజలు, రైతుల గురించి ఆలోచన చేసే రైతు నాయకుడు, తెలంగాణ తనానికి దర్పణంగా నిలిచే మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి, తెలంగాణ సాధకుడు, రైతు బాంధవుడు కేసీఆర్ కలయిక సందర్భంగా ఉద్విగ్న వాతావరణం నెలకొంది. తెలంగాణకు నష్టం జరుగుతున్న సమయంలో మీతో కలిసి పనిచేయాల్సిన అవసరమున్నదని, మీతో కలిసి పనిచేయమని దేవుడే నన్ను మీదగ్గరికి పంపించిండు.. అన్నా అని అన్నారు. చాలాకాలం తర్వాత మీతో కలిసి పనిచేసే అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు. కాగా, జీవన్ రెడ్డిగారిని అనునయిస్తూ ఆయనను అప్యాయంగా దగ్గరికు తీసుకున్న కేసీఆర్ హృదయపూర్వకంగా ఆలింగనం చేసుకొని దుశ్శాలువాతో సన్మానించి పుష్పగుచ్ఛం ఇచ్చి ఆహ్వానించారు. కొద్దిసేపు ఇరువురూ ఇష్టాగోష్టి జరుపుకున్న తర్వాత జీవన్ రెడ్డి బృందాన్ని కేసీఆర్ లంచ్‌కు ఆహ్వానించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





