– పార్టీ మారే ఆలోచన విరమించుకోవాలని వినతి
– అవమానం జరుగుతుంటే ఎలా అని జీవన్ నిలదీత
– భవిష్యత్ కార్యాచరణను రేపు చెబుతాననన్న జీవన్ రెడ్డి
జగిత్యాల, ప్రజాతంత్ర, మార్చి 21 : పార్టీ మారతానన్న మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్‌రెడ్డిని బుజ్జగించే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఆయనతో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్క్ష్మణ్, ఎమ్మెల్యే సత్యం భేటీ అయ్యారు. గంటకుపైగా సమావేశమయ్యారు. పార్టీలో గౌరవం దక్కడం లేదని మంత్రుల ముందు జీవన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అయితే సమస్య ఉంటే అధిష్టానంతో మాట్లాడదామని, పార్టీ మారే ఆలోచన మంచిది కాదని సూచించారు. దీనికి జీవన్‌రెడ్డి పెద్దగా స్పందించలేదు. ఈ భేటీ అనంతరం మంత్రి శ్రీధర్‌బాబు మీడియాతో మాట్లాడారు. జీవన్‌రెడ్డి నాలుగు దశాబ్దాలుగా పార్టీలో ఉన్నారని, ఆయనతో అనేక అంశాలు చర్చించినట్లు తెలిపారు. ఆయన ఆవేదనను పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఈ భేటీ అనంతరం జీవన్‌రెడ్డి మాట్లాడారు. తన నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదన్నారు. పూర్తి వివరాలు ఆదివారం వెల్లడిస్తానని చెప్పారు. కొంతకాలంగా కాంగ్రెస్‌పై అసంతృ ప్తితో ఉన్న జీవన్‌రెడ్డి పార్టీ మారుతారన్న ప్రచారంతో ఇద్దరు మంత్రులను పార్టీ రంగంలోకి దింపింది. పార్టీ వీడకుండా ఉండేందుకు ఆయనతో మంత్రులు శ్రీధర్‌బాబు, లక్క్ష్మణ్ సంప్రదింపులు మొదలుపెట్టారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ.. అసలు కాంగ్రెస్ నాయకులకు అన్యాయం చేయడంపై జీవన్‌రెడ్డి కొంతకాలంగా బహిరంగంగానే అసమ్మతి తెలుపుతున్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కూడా ఆయన అధిష్ఠానాన్ని కోరారు. కానీ హైకమాండ్ పట్టించుకోకపోవడంతో పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో సమావేశానికి రావాలని రాష్ట్ర ఏఐసీసీ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ ఆహ్వానించారు. కానీ ఆమెతో జరగాల్సిన మీటింగ్‌కు జీవన్‌రెడ్డి గైర్హాజరయ్యారు. ఈ క్రమంలోనే ఆయన ఇంటికి ఆ ఉదయం మంత్రులు శ్రీధర్‌బాబు, లక్క్ష్మణ్, చొప్పదండి ఎమ్మెల్యే, కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం, ‘సుడా’ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి వెళ్లారు. జీవన్‌రెడ్డితో అల్పాహారం చేస్తూ ముచ్చటించారు. కాగా, రాజీవ్ గాంధీ ఆశయాలకనుగుణంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ లేదని ఆయన అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ సమయంలో మీడియాను లోపలికి అనుమతించకుండా రహస్యంగా చర్చించారు. ఈ నెల 25న పార్టీకి జీవన్ రెడ్డి రాజీనామా చేస్తున్నారని సమాచారం.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





