జేఈఈ మెయిన్‌ ‌ఫలితాల విడుదల

– వంద శాతంతో సత్తా చాటిన ముగ్గురు తెలుగు విద్యార్థులు

న్యూదిల్లీ, ఫిబ్రవరి 16: దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్న జేఈఈ (మెయిన్‌) ‌పేపర్‌-1 ‌ఫలితాలు వచ్చేశాయి. సోమవారం ఉదయం ఫైనల్‌ ‌కీ విడుదల చేసిన ఎన్‌టీఏ అధికారులు.. తాజాగా ఫలితాలను విడుదల చేశారు. ఈ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. ఏపీ నుంచి ఇద్దరు, తెలంగాణ నుంచి ఒక విద్యార్థి 100 పర్సంటైల్‌ ‌స్కోరుతో అదరగొట్టారు. అభ్యర్థులు తమ అప్లికేషన్‌ ‌నంబర్‌, ‌పాస్‌వర్డ్‌తో పాటు క్యాప్చా కోడ్‌ ఎం‌టర్‌ ‌చేసి స్కోర్‌ ‌కార్డులను డౌన్‌లోడ్‌ ‌చేసుకోవచ్చు.దేశంలో ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ ఐటీల్లో బీఈ/బీటెక్‌ ‌కోర్సుల్లో ప్రవేశాలకు జనవరి 21, 22, 23, 24, 28 తేదీల్లో జేఈఈ మెయిన్‌ ‌పేపర్‌ -1 ‌పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే.  జనవరి 29న నిర్వహించిన జేఈఈ మెయిన్‌ ‌పేపర్‌-2 ‌ఫలితాలను తర్వాత ప్రకటించనున్నారు. జేఈఈ మెయిన్‌ ‌పరీక్షలకు దేశ వ్యాప్తంగా 13,55,293మంది రిజిస్టర్‌ ‌చేసుకోగా.. 13,04,653 మంది (96.26?) హాజరయ్యారు. ఈ ఫలితాల్లో మొత్తంగా 12మంది విద్యార్థులు 100 పర్సంటైల్‌ ‌స్కోరుతో అదరగొట్టారు. వీరిలో ఏపీ నుంచి నరేంద్రబాబు గారి మహిత్‌, ‌పసల మోహిత్‌, ‌తెలంగాణ నుంచి వివాన్‌ ‌శరద్‌ ‌మహిశ్వరి ఉన్నారు. మరోవైపు, జేఈఈ మెయిన్‌ ‌మలి విడత పరీక్షకు దరఖాస్తుల స్వీకరణ పక్రియ కొనసాగుతోంది. మొదటి విడత పరీక్షలో సాధించిన స్కోరుతో సంతృప్తి చెందని వారు రెండో విడత పరీక్షలు రాస్తుంటారు. ఏప్రిల్‌ 2 ‌నుంచి 9వ తేదీ వరకు జేఈఈ మెయిన్‌ ‌రెండో విడత పరీక్షలు జరుగుతాయి. ఈ రెండింటిలో ఉత్తమ స్కోరును పరిగణనలోకి తీసుకొని విద్యార్థులకు ర్యాంకులను కేటాయిస్తారు. ఆ తర్వాత సామాజిక వర్గాల వారీగా రిజర్వేషన్లకు అనుగుణంగా మొత్తం 2.50లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ‌రాసేందుకు అర్హత కల్పిస్తారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో సత్తా చాటిన విద్యార్థులకు జోసా కౌన్సిలింగ్‌ ‌ద్వారా ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో ఇంజినీరింగ్‌ ‌కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తుంటారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *