– బాలుడు దుర్మరణం
వికారాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 2: వికారాబాద్ జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. జేసీబీని తీసుకెళుతున్న ట్రక్కు బైక్‌పై బోల్తాపడిన ఘటనలో ఓ బాలుడు మరణించాడు. బాలుడి తండ్రి తీవ్రంగా గాయపడ్డాడు. ధారూరు మండలం కొండాపూర్ కలాన్ నుంచి 8 ఏళ్ల రిత్విక్ తన తండ్రి లాలయ్యతో కలిసి బైక్‌పై వికారాబాద్ వెళుతున్నాడు. బైక్ వెనకాలే స్కూటీపై రిత్విక్ తల్లి మేఘన, చెల్లెలు ఫాలో అవుతున్నారు. వికారాబాద్ సపంలోని బుగ్గ రామేశ్వర ఆలయం మలుపులో ఊహించని విషాదం చోటుచేసుకుంది. జేసీబీని తీసుకెళుతున్న ట్రక్కు మలుపు వద్ద అదుపుతప్పి బైక్‌పై బోల్తా పడింది. దీంతో రిత్విక్ అక్కడికక్కడే చనిపోయాడు. లాలయ్య కాలు విరిగింది. స్కూటీపై వెళ్తున్న తల్లీకూతుళ్లకు కూడా స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే స్పందించి హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ట్రక్కు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో తెలిసింది. ట్రక్కు డ్రైవర్ తాగి ఉన్నాడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రిత్విక్ మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
——————————————————————————————————————————————————————–
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




