హైదరాబాద్‌లో జయలలిత ఇల్లు సీజ్

– ఇంటి పన్ను చెల్లించకపోవడంతో చర్యలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 31: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలితకు చెందిన ఇంటిని జీహెచ్ఎంసీ అధికారులు సోమవారం సీజ్ చేశారు. హైదరాబాద్‌ శ్రీనగర్ కాలనీలోని ఇంటికి  పన్ను బకాయిలు చెల్లించకపోవడంతో ఈ చర్య తీసుకున్నారు. ఆ ఇంటికి సంబంధించిన ఆస్తి పన్ను బకాయిలు చెల్లించకపోవడంతో జీహెచ్ఎంసీ అధికారులు ఫిబ్రవరిలోనే నోటీసులు జారీ చేశారు. అయితే జయలలితకు సంబంధించిన వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఈ క్రమంలో శ్రీనగర్ కాలనీలో ఉన్న జీ -4 భవనాన్ని సీజ్ చేశారు. 2017 నుంచి సుమారు రూ.83 లక్షల ఆస్తి పన్ను బకాయిలు ఉన్నాయని సమాచారం. సోమవారం జీహెచ్ఎంసీ ఏఎంసీ బాల్‌రాజ్ ఆధ్వర్యంలో సిబ్బంది జయలలిత ఇంటిని సీజ్ చేశారు. మార్చి 31 వరకు ఓటీఎస్ స్కీమ్ అందుబాటులో ఉందని, ఆ రాయితీ పోగా మొత్తం రూ.82,91,822 మేర బకాయిలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. జయలలితకు సంబంధించిన ఈ భవనంలో గతంలో పైవేట్ కార్యాలయాన్ని నిర్వహించారు. అయితే ఈ భవనాన్ని 2017 నుంచి నివాసానికి వాడుకుంటున్నామని, కాబట్టి రెసిడెన్షియల్‌గా మార్పాలని జీహెచ్ఎంసీ అధికారుల్ని జయలలిత మేనల్లుడు, చెన్నైకి చెందిన దీపక్ జయకుమార్ గతంలో కోరారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *