– రెండు రాష్ట్రాల్లోని అభివృద్ధి, రాజకీయ పరిస్థితులపై చర్చ
రాంచీ, సెప్టెంబర్ 10: జార్ఖండ్ పర్యటనలో భాగంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను రాంచీలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రస్తుత రాజకీయ పరిణామాలు తదితర అంశాలపై చర్చించారు. జార్ఖండ్ ముక్తి మోర్చా వ్యవస్థాపకుడు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, హేమంత్ తండ్రి శిబూ సోరెన్ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన విషయం విదితమే. శిబూ సోరెన్ మృతి పట్ల డిప్యూటీ సీఎం తన సంతాపాన్ని ప్రకటించారు. ఇటీవల జరిగిన జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జిగా భట్టి విక్రమార్క అక్కడ విస్తృతంగా పర్యటించి హేమంత్ సోరెన్‌తో కలిసి ప్రచారం నిర్వహించారు. జేఎంఎం, కాంగ్రెస్ కూటమి ఆ ఎన్నికల్లో విజయం సాధించడంలో భట్టి విక్రమార్క కీలక భూమిక పోషించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





