జనహిత పాదయాత్రకు వరంగల్‌లో ఘన స్వాగతం

– అక్కడినుంచి భారీ ర్యాలీతో వర్ధన్నపేటకు

వరంగల్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 25: వర్ధన్నపేట నియోజకవర్గంలో జనహిత పాదయాత్రలో పాల్గొనేందుకు వచ్చిన పిసిసి అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్‌, కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌లకు కాకతీయ యూనివర్సిటీ వద్ద ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌ రెడ్డి ఘన స్వాగతం పలికారు. అక్కడినుంచి కార్యకర్తలు భారీ ర్యాలీగా వర్ధన్నపేటకు తరలి వెళ్లారు. హంటర్‌ రోడ్డు రైల్వే బ్రిడ్జి వద్ద మహేష్‌ కుమార్‌ గౌడ్‌, మీనాక్షి నటరాజన్‌లకు కొండా అనుచర వర్గం స్వాగతం పలకగా పాదయాత్ర భారీ కాన్వాయ్‌తో వర్ధన్నపేట నియోజకవర్గానికి బయలుదేరింది. ఇల్లంద మార్కెట్‌ యార్డు వద్ద స్థానిక ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు, డిసిసి అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, పలువురు కాంగ్రెస్‌ నేతలు వారికి స్వాగతం పలికారు. భారీ జన సమీకరణతో ఇల్లంద మార్కెట్‌ నుండి జనహిత పాదయాత్ర ప్రారంభమైనది. రోడ్డు పొడవునా వాహనాలు, ఫ్లెక్సీలు, మూడు రంగుల జెండాలమయమే. ఇల్లంద మార్కెట్‌ నుండి వర్ధన్నపేట అంబేద్కర్‌ చౌరస్తా వరకు ్న పాదయాత్ర కొనసాగింది. ఇల్లంద గ్రామం సమీపంలో రాజీవ్‌ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నేతలు పాదయాత్ర కొనసాగిస్తున్నారు. పాదయాత్ర మూడు గంటల ఆలస్యమైనా ప్రజలు, కార్యకర్తలు, నాయకులు వేలమంది పాల్గొన్నారు. పాదయాత్రలో ఉమ్మడి వరంగల్‌ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు, ముఖ్యం నేతలు పాల్గొన్నారు. రాత్రి 8 గంటల తర్వాత వర్ధన్నపేట అంబేద్కర్‌ సెంటర్‌కు పాదయాత్ర చేరుకుంది. అక్కడ ఏర్పాటు చేసిన కార్నర్‌ మీటింగ్‌లో ముఖ్య నేతలు ప్రసంగించారు. మక్కన్‌ సింగ్‌. రాజ్‌ఠాకూర్‌, వేం నరేందర్‌ రెడ్డి, కొండా మురళి. కొండా సురేఖ. నాయిని రాజేందర్‌ రెడ్డి. యశస్విని రెడ్డి, మురళి నాయక్‌, రామచంద్ర నాయక్‌ తదితరులు పాల్గొన్నారు. కేయూ వద్ద స్వాగత కార్యక్రమంలో నగర మేయర్‌ గుండు సుధారాణి, ఫ్లోర్‌ లీడర్‌ తోట వెంకన్న, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్‌ అజిజ్‌ ఖాన్‌, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఈవీ శ్రీనివాస్‌ రావు, పీసీసీ సభ్యుడు బత్తిని శ్రీనివాస్‌ రావు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.


 

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండిరగ్‌ వీడియోల కోసం Prajatantra వెబ్‌సైట్‌ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్‌ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్‌ను ఫాలో కండి. అలాగే మా ప్రజాతంత్ర యూట్యూబ్‌ చానల్‌ను సబ్‌ స్క్రైబ్‌ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్‌ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్‌ చేయడం మరిచిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *