– మైనారిటీ సంక్షేమ, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ శాఖల మంత్రి అజారుద్దీన్
సూర్యాపేట, ప్రజాతంత్ర, 24: జాన్ పహాడ్ దర్గా సర్వమత సమ్మేళనానికి ప్రతీక అని మైనారిటీ సంక్షేమ శాఖ, పబ్లిక్ ఎంటర్‌ప్రైజస్ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ అన్నారు. పాలకవీడు మండలం జాన్‌పహాడ్ దర్గాను మంత్రి శనివారం దర్శించుకున్నారు. ఆనంతరం అయన మాట్లాడుతూ శుక్రవారం ఉర్సు జరిగిందని, శనివారం ఆయన జియారత్ (దర్శనం) కోసం వచ్చానని, ఇక్కడ రావƒటం చాలా సంతోషంగా ఉందని రు. హిందూ, ముస్లిం, సిక్కు, క్రైస్తవలు అందరూ ఇక్కడికి వచ్చి తమ మొక్కులు తీర్చుకుని వెళ్తుంటారని తెలిపారు. మీ అందరి మధ్యకు రావడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని, అల్లా దయవల్ల అవకాశం దొరికితే మళ్ళీ వస్తానని తెలిపారు. మీరందరూ ఇక్కడ కలిసిమెలిసి ఉండాల, మంచి పనులు చేయాలని తాను కోరుకుంటున్నాన్నారు. ఇది చాలా పెద్ద దర్గా షరీఫ్, ఇక్కడ గొప్ప మహనీయులు (బుజుర్గాన్-ఏ-దీన్) కొలువై ఉన్నారని తెలిపారు. ఇన్షా అల్లాహ్ వచ్చే ఏడాది కూడా ఇంకా బాగా జరుగుతుందని ఆశించారు. కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాసులు, డీఎస్పీ ప్రసన్నకుమార్, మైనారిటీ సంక్షేమ అధికారి నరసింహారావు, తహసీల్దార్ కమలాకర్, వక్ఫ్ బోర్డు ఇన్‌స్పెక్టర్ మహబూబ్, ముజవర్ జానీబాబా, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





