దేశంలోనే నెంబ‌ర్ వ‌న్ గా జమలాపురం టూరిజం పార్కు

  • ఎకో టూరిజం అభివృద్ధిపై ప్ర‌త్యేక దృష్టి
  • ఉప ముఖ్యమంత్రిఆర్థికఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు

భార‌త‌దేశ టూరిజం చిత్ర‌ప‌టంలో జమలాపురం టూరిజం పార్కును అగ్రస్థానంలో ఉంచుతానని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారుఖమ్మం జిల్లా ఎరుపాలెం మండలంలో తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటించి పలు రహదారులకు  టూరిజం పార్కు నిర్మాణానికి మంగళవారం శంకుస్థాపన చేశారుఅనంతరం జమలాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూఇండియా టూరిజం మ్యాప్ లో ఎర్రుపాలెం మండలానికి ప్రత్యేక స్థానం కల్పించేలా పర్యాటకంగా మండలాన్ని అభివృద్ధికి పటిష్ట ప్రణాళికలు తయారు చేస్తున్నామని మంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు.  ఎర్రుపాలెం మండలంలో పర్యటించి రూ.5 .83 కోట్ల‌తో చేపట్టిన జమలాపురం అటవీ పార్క్ ‌పనులకు శంకుస్థాపన చేశారుఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. చాలా సంవత్సరాల నుంచి జమలాపురం దేవాలయ పరిసర ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రజలు ఆకాంక్షించారనిదీనిని దృష్టిలో ఉంచుకొని గతంలో జమలాపురం చెరువు ట్యాంక్‌ ‌బండ్‌ ‌గా అభివృద్ధి చేసుకున్నామనిచెరువు కట్ట మీద రోడ్డు విస్త‌రించి గుట్ట మధ్య నుంచి రేమిడిచెర్ల వరకు రోడ్డు వేసుకున్నామని అన్నారుప్రజా ప్రభుత్వం వొచ్చిన తర్వాత వెంటనే జమలాపురం చెరువుపక్కన కాటేజ్‌ ‌కోసం పర్యాటక శాఖతో ప్రణాళికలు తయారు చేశామన్నారు.

  అటవీ శాఖ పరిధిలో ఎకో టూరిజం అభివృద్ధి చేయాలని ప్రత్యేకమైన ఆదేశాలు జారీ చేశామని అన్నారుఅడవులను ధ్వంసం చేయకుండాదానిని ఆస్వాదిస్తూ బతికేందుకు అవసరమైన కాటేజి అభివృద్ధి చేస్తే టూరిజం పెరుగుతుందనిదీనివల్ల స్థానిక ప్రజలకు ఆదాయం మెరుగవుతుందని తెలిపారుటూరిజం అభివృద్ధి కావడం వల్ల ఇక్కడ వ్యాపారాలు బాగా జరుగుతాయన్నారు6 నెలల్లో అటవీ పార్క్ ‌పనులు పూర్తి చేసి అందుబాటులోకి తేవాలన్నారుబుచ్చిరెడ్డి పాలేనికి వెళ్లే రోడ్డు మార్గంలో ఇద్రీనమ్మ చెరువు దగ్గర కూడా పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తూనాగార్జున సాగర్‌ ‌నుంచి లింక్‌ ‌చేసి అక్కడ ఎప్పుడూ నీళ్లు ఉండే విధంగాకాటేజ్‌‌పార్క్‌భద్రత ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారుఇంట‌ర్నెట్  ద్వారా ప్రచారం చేస్తే ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వొచ్చి ఆహ్లాదకరంగా ఇక్కడ గడుపుతారన్నారుగతంలో తాగునీటి సరఫరా పనులు చేసే సమయంలోనే ఐదెక‌రాలు అధికంగా స్థలం సేకరించామనిప్రస్తుతం ఆ స్థలం పార్కు ‌పర్యాటక ప్రాంత అభివృద్ధికి ఉపయోగపడుతుందన్నారులక్ష్మీపురం నుంచి వొచ్చే ప్రజలకు అక్కడ రింగ్‌ ‌రోడ్డు మాదిరి ఉండేలా చేస్తున్నామని  తెలిపారుజమలాపురం వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి కూడా ఆస్కారం ఉంటుందని పేర్కొన్నారు

జిల్లాలో మారుమూల మండలం ఎర్రుపాలెం అనిఇక్కడ అధికంగా మనకు ప్రకృతిపరంగా అందమైన గుట్టలు అడవి ఉంది కాబట్టి పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసుకోవాలనిదీనివల్ల ఉద్యోగాలుసంపద వస్తాయని డిప్యూటీ సీఎం తెలిపారుమన మండలానికి వొచ్చే పర్యాటకులు అతిథులతో సమానమనివారిని గౌరవంగా చూసుకుంటే మన ప్రాంతం అభివృద్ధి వేగవంతంగా జరుగుతుందని పేర్కొన్నారుఇక్కడికి వొస్తే బాగా చూసుకుంటారనే పేరు రావాలని కోరారు.  మండలంలోని అడవిచెరువులే మన ఆస్తి అని వీటిని మనం సంరక్షించుకోవాలని ఉప ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.

జిల్లా కలెక్టర్‌ ‌ముజమ్మిల్‌ ‌ఖాన్‌ ‌మాట్లాడుతూడిజైన్‌ ‌నుంచి తుది అభివృద్ధి ప్రణాళిక రూపకల్పన వరకు  ప్రజలకు ఉపయోగపడేలా జమలాపురం ఆలయానికి వొచ్చే భక్తులు ఆహ్లాదంగా గడిపేలా ఉప ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ వహించారని తెలిపారుపార్క్ ‌శంకుస్థాపన కార్యక్రమానికి చాలా రోజుల నుంచి అధికారులు పడిన శ్రమ ఫలితమని అన్నారుఖమ్మం నగరంలో వారానికి దాదాపు 5 వేల మంది ప్రజలు వెలుగు మట్ల అర్బన్‌ ‌పార్క్ ‌కు వొచ్చి సరదాగా గడుపుతున్నారన్నారుప్రకృతిని కాపాడటం మన సంస్కృతిలో భాగమనిప్రకృతితో కలిసిమెలిసి అభివృద్ధి సాధించాలన్నారు.

అనంతరం చీఫ్‌ ‌కన్జర్వేటర్‌ ఆఫ్‌ ‌ఫారెస్ట్ ‌భీమా నాయక్‌ ‌మాట్లాడుతూ,  అటవీని సంరక్షిస్తూ ఇక్కడ ఆహ్లాదకరమైన పరిస్థితులు ఏర్పాటు చేసేందుకు అర్బన్‌ ‌పార్క్ ‌కార్యాచరణ తయారు చేశామ‌ని చెప్పారుఆధ్యాత్మిక వాతావరణంలో ఈ పార్క్ ఉం‌డే విధంగా నిర్వహిస్తామన్నారు.  కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ ‌డాక్ట‌ర్‌ పి.శ్రీజజిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ ‌విక్రమ్‌ ‌సింగ్‌‌ఖమ్మం ఆర్డీవో నర్సింహారావుతహసీల్దార్ ఎం.ఉషారాణిఆర్‌ఐ ‌రవికుమార్‌,  ‌రాజశేఖర్‌ఎం‌పీడీవోసురేందర్‌‌వైరా ఏసిపి.రెహమాన్‌‌మధిర సిఐడి మధుఎఫ్డివో మంజుల,  ప్రజాప్రతినిధులుసంబంధిత అధికారులుఎర్రుపాలెం మండల కాంగ్రెస్‌ ‌అధ్యక్షులుకార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *