అన్ని పార్టీలు సిండికేట్‌ అయ్యాయి

– బీసీలు సర్పంచులు కావోద్దని అడ్డుకుంటున్న అగ్రవర్ణ పార్టీలు
– బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల

హనుమకొండ, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 3: బీసీ రిజర్వేషన్‌ బిల్లుకు అన్ని ప్రతిపక్షాలు మద్దతు తెలపాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ విజ్ఞప్తి చేశారు. హనుమకొండ హరిత కాకతీయ హోటల్లో ఉమ్మడి వరంగల్‌ జిల్లా బీసీ సంఘం అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్‌ గౌడ్‌ అధ్యక్షతన బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వందల కోట్లు దోచుకుని పదేళ్లు బీసీలను గత పాలకులు మోసం చేశారన్నారు. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్‌ పెంచకుండా రాజకీయ పార్టీలు, అగ్రకుల పెద్దలు కుట్రలు చేస్తున్నారని, బీసీలు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పిటిసిలు కాకూడదా అని అగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సి, ఎస్టీలకు అగ్రకులాలకు వారి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్‌తో న్యాయం జరుగుతోంది కానీ 60% జనాభా కలిగి ఉన్న బీసీలకు 42% ఇవ్వడానికి పార్టీలకు సమస్య ఏంటని ప్రశ్నించారు. బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు గల్లీలో మద్దతు ఇస్తూ దిల్లీిలో అడ్డుకుంటున్నారని విమర్శించారు. బీసీల పట్ల అన్ని పార్టీలు సిండికేట్‌గా మారాయన్నారు. నిజంగా మోదీ బీసీ అయితే పార్లమెంటులో బీసీ బిల్లు ఎందుకు పెట్టట్లేదు అని ఆయన ప్రశ్నించారు. 42% ఆమోదం తెలపని పక్షంలో స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం బీసీలకు రాజకీయ పార్టీ వస్తుందినీ, తమ ఓట్లు తాము వేసుకొని ఇతర పార్టీలను బొంద పెడతామని హెచ్చరించారు. సమావేశంలో బీసీ ఇంటలెక్చువల్‌ ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టరు సంఘాని మల్లేశ్వర్‌, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు దాడి మల్లయ్య యాదవ్‌, రాష్ట్ర కార్యదర్శి భీమగాని యాదగిరి గౌడ్‌, బీసీ కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వరంగల్‌ శ్రీనివాస్‌, బీసీ యువజన సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు పాండవుల సురేష్‌, మహిళా సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మాధం పద్మజ దేవి, మహిళా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు తమ్మేలా శోభరాణి, బీసీ మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు మడిశెట్టి అరుంధతి, జిల్లా నాయకులు తెల్ల సుగుణ, కిషోర్‌, డాక్టర్‌ రాము, అరుణ బూర్గుల ప్రమోద, మానస తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *