నిష్కళంక నేత జైపాల్‌రెడ్డి

సీఎం రేవంత్‌ నివాళులు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 27: రాష్ట్ర, దేశ రాజకీయాల్లో జైపాల్‌రెడ్డి ఒక ఉన్నత శిఖరం అని, ప్రజాస్వామ్యం, రాజకీయాల పట్ల లోతైన అవగాహన ఉన్న వ్యక్తి అని సీఎం రేవంత్‌రెడ్డి కొనియాడారు. ఉత్తమ పార్లమెంటేరియన్‌, కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్‌రెడ్డి వర్థంతి సందర్భంగా ఆయనకు సీఎం నివాళులర్పించారు. ప్రతి అంశంపై అద్భుతమైన వాగ్ధాటి, చతురత ఆయన సొంతమన్నారు. విద్యార్థి నాయకుడిగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా అనునిత్యం ప్రజల కోసమే పనిచేశారన్నారు. తెలంగాణ రాష్ట్ర సాకారంలో ఆయన పోషించిన పాత్రను ప్రజలెప్పుడూ మరిచిపోలేరని అన్నారు. రాజకీయాల్లో ఎప్పుడూ విలువల విషయంలో రాజీ పడలేదని, నిష్కళంక నేతగా, విలువలకు ప్రతీకగా జైపాల్‌ రెడ్డి గనిలిచారన్నారు. దక్షిణాది నుంచి తొలిసారి ఉత్తమ పార్లమెంటేరియన్‌ పురస్కారం అందుకున్న నేతగా జైపాల్‌ రెడ్డి ఘనత సాధించారన్నారు. వారి ఆశయాలను, ఆకాంక్షలను ముందుకు తీసుకుపోవడమే ఆయనకు నిజమైన నివాళి అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *