బీఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌ ‌దొందూదొందే

– ఇరు పార్టీల పాలనలో నల్లగొండకు అన్యాయం
– కృష్ణా జలాలు అందించడంలో రెండు ప్రభుత్వాలు విఫలం
– హాస్పిటల్‌లో కనీస వసతులు కల్పించలేక పోయారు

– జాగృతి ‘జనం బాట’లో కవిత ఘాటు విమర్శలు

నల్లగొండ, ప్రజాతంత్ర, నవంబర్‌ 12: తెలంగాణ వొచ్చాక కూడా నల్లగొండ జిల్లాకు కృష్ణా జలాలు అందలేదని, బీఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌ ‌పార్టీలు జిల్లాకు సాగునీరు అందించడంలో విఫలం అయ్యాయ‌ని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమ‌ర్శించారు. ప్రభుత్వాలను నిలదీసేందుకే జనం బాట చేపట్టామన్నారు. ‘జనం బాట’లో భాగంగా జిల్లాలో కవిత పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సుంకిశాల లిప్ట్ ఇరిగేషన్‌ ‌కాంట్రాక్టర్‌పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఎస్‌ఎల్‌బీసీ ఘటనపై విచారణ జరగాలి. నాగార్జున సాగర్‌ ఎడమ కాలువను రాష్ట్ర ప్రభుత్వం తమ అధీనంలోకి తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. కృష్ణా జలాలను నల్లగొండకు తీసుకురాకపోతే భూ నిర్వాసితులతో ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడిస్తాం అని అన్నారు. బీఆర్‌ఎస్‌ను తిట్టి కాంగ్రెస్‌ అధికారంలోకి వొచ్చింది. కాంగ్రెస్‌ కూడా అదే నిర్లక్ష్యం చేస్తుంది. సీఎం ఆదేశాలను కలెక్టర్‌లు పట్టించుకోవడం లేదు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ హాస్పిటల్‌లో ఎపిడ్యూరల్‌ ‌మెడిసీన్‌ అం‌దివ్వకపోవడం బాధ అనిపించింది. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఎపిడ్యూరల్‌ ‌మెడిసీన్‌ను ప్రభుత్వ హాస్పిటల్‌లో అందుబాటులో ఉంచాలి. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం భూదాన్‌ ‌భూములను స్వాధీనం చేసుకోవాలి. యాదాద్రి థర్మల్‌ ‌పవర్‌ ‌ప్లాంట్‌ ఎప్పు‌డు అందుబాటులోకి తీసుకువస్తారో సీఎం చెప్పాలి అని కవిత డిమాండ్‌ ‌చేశారు. గత బీఆర్‌ఎస్‌, ‌ప్రస్తుత కాంగ్రెస్‌ ‌పాలనలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని విమర్శించారు. గత 12 ఏళ్లలో పూర్తి స్థాయిలో జిల్లాకు కృష్ణా జలాలు అందాయో లేదో ఆలోచించాలన్నారు. సుంకిశాల రిటైనింగ్‌ ‌వాల్‌ ‌కూలిపోతే కాంట్రాక్టర్‌ను ఒక్క మాట అనలేదని.. ప్రాజెక్టుల పరిశీలనలో తాము వెళ్తే నిర్వాసితులు కన్నీరు పెడుతున్నారన్నారు. ఇదేనా బంగారు తెలంగాణ అని ప్రశ్నించారు. నల్గొండ జీజీహెచ్‌ ‌మెటర్నిటీ వార్డులో కనీస వసతులు లేవన్నారు. ఐసీయూలో ఒక్కో బెడ్‌కు ఇద్దరిని పడుకోబెడుతున్నారని తెలిపారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ఎప్పు‌డు పూర్తి అవుతుందని ప్రశ్నించారు. భూదాన్‌ ‌భూములు ఎందుకు వెనక్కి తీసుకోలేదని నిలదీశారు. నాగార్జున సాగర్‌ ‌రైట్‌ ‌బ్యాంక్‌ ఏపీ చేతిలో ఉందని.. లెప్ట్ ‌బ్యాంక్‌ ‌పూర్తిగా సెంట్రల్‌ ‌చేతులో పెట్టారన్నారు. సామాజిక తెలంగాణ రావాల్సి ఉందని, అందుకోసం తెలంగాణ జాగృతి పోరాడుతుందని స్పష్టం చేశారు. 20 శాతం తేమ ఉన్నా పత్తిని కొనుగోలు చేయాలని డిమాండ్‌ ‌చేశారు. రైతులను ఇబ్బందులు పెడుతోన్న నిబంధనలను సడలించాలన్నారు. కాగా, నల్గొండ పట్టణంలో పర్యటించిన కవిత జిల్లా కేంద్ర ప్రభుత్వ హాస్పిటల్‌ని సందర్శించి రోగులతో మాట్లాడారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కవిత పర్యటన నేపథ్యంలో నల్గొండలో హోర్డింగ్‌లు,ప్లెక్సీలను జాగృతి నాయకులు ఏర్పాటు చేశారు. కానీ రాత్రికి రాత్రే హోర్డింగ్‌లు, ప్లెక్సీలను మున్సిపల్‌ అధికారులు తొలగించారు. దీనిపై కవిత స్పందిస్తూ కోమటిరెడ్డికి తనకు పంచాయితీ లేదని, కానీ తన ప్లెక్సీలు తొలగించారని మండిపడ్డారు. అరెస్టు చేసిన జాగృతి నాయకులను విడుదల చేయాలని డిమాండ్‌ ‌చేశారు. ప్రజా సమస్యలపై స్పందించేందుకు నల్గొండ వచ్చానని, పాలిటిక్స్ ‌చేసేటప్పుడు గట్టి వాళ్లనే జాగృతి పోటీలో నిలబెడుతుంద‌ని అన్నారు. జాగృతి నాయకులతో పెట్టుకున్నోళ్లు బాగుపడలేదని కవిత వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి పెద్ద మంత్రి అనుకున్నానని, ప్రజా సమస్యలు ప్రస్తావిస్తే ప్లెక్సీలు తొలగిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చేతనైతే ప్రభుత్వం సమస్యలను త్వరగా పరిష్కరించాలన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page