బాధిత కుటుంబాలకు రూ. కోటి చెల్లించాలి

– తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్‌
– బస్సు ప్రమాదంలో మృతుల‌ కుటుంబాల‌కు ప‌రామ‌ర్శ
– ఇది ప్రభుత్వ  నిర్లక్ష్యమే
– ప్రమాదం తర్వాత గుంతలు పూడుస్తున్న వైనం

తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 7: మీర్జాగూడ బస్సు ప్రమాదంలో మరణించిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం కోటి రూపాయల చొప్పున నష్టపరిహారం అందించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మిర్జాగూడ బస్సు ప్రమాదంలో మరణించిన కుటుంబాలను ఆమె శుక్రవారం ప‌రామ‌ర్శించారు. ఇందులో భాగంగా  వికారాబాద్ జిల్లా యలాల్ మండలం పేర్ కంపల్లి  గ్రామానికి చెందిన ఎల్లయ్య గౌడ్ కుమార్త‌లు తనుషా, సాయి ప్రియ, నందిని లు బస్సు ప్రమాదంలో మరణించడంతో వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఒకే ఇంట్లో ముగ్గురు మరణించడం చాలా బాధాకరమైన విషయ‌మ‌న్నారు. ఇది కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం అన్నారు. ప్రమాదానికి రోడ్డు పనులు నిర్మించకపోవడం ప్రధాన కారణం అని అన్నారు. ఎన్జిటిలో ఉన్న కేసు పరిష్కారమైనప్పటికీ రోడ్డు పనులు చేపట్టకుండా  ప్రమాదం జరిగిన తర్వాత రోడ్డుపై గుంతలు పూడుస్తున్నారని, ఇదే రోడ్డు గతంలో పనులు పూర్తి చేస్తే 19 మంది చనిపోకుండా ఉండేవారని అన్నారు. ఈ మరణాలు యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయ‌న్నారు. చనిపోయిన ప్రతి ఒక్కరికి కోటి రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page