– అంధ బాలుడి కుటుంబానికి అండ
– రూ. 7.50లక్షల చెక్కు అందజేత
సంగారెడ్డి, ప్రజాతంత్ర,సెప్టెంబరు 13: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి. జయప్రకాశ్‌రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న అంధ బాలుడి కుటుంబానికి ఆయన అండగా నిలిచారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం లోంకా తండాకు చెందిన వికాస్ నాయక్ మూడేళ్ల వయస్సులో అనారోగ్యం బారిన పడ్డాడు. దీంతో అతడు కంటి చూపును కోల్పోయాడు. అతడి తల్లిదండ్రులు ఎన్ని హాస్పిటల్‌లకు తిరిగినా..వికాస్‌కు చూపు మాత్రం రాలేదు. ప్రస్తుతం నిజామాబాద్‌లోని అంధుల పాఠశాలలో వికాస్ ఐదో తరగతి చదువుతున్నారు. ఇక అతడికి చూపు లేకున్నా వికాస్ నాయక్.. గాయకుడిగా రాణిస్తున్నాడు. అయితే వికాస్ నాయక్ తండ్రికి రెండు కిడ్నిలు పాడైపోయి.. మంచం పట్టాడు. వికాస్ కంటి చూపు కోసం.. తండ్రి చికిత్స కోసం ఆ కుటుంబం భారీగా అప్పు చేసింది. దీంతో అసలు తో పాటు వడ్డీ సైతం భారీగా పెరిగిపోయింది. అప్పు వడ్డీ కలిసి.. దాదాపు రూ. 6 లక్షలకుపైగా దాటింది. ఈ నేపథ్యంలో ఇటీవల వికాస్ కుటుంబ సభ్యులు.. జగ్గారెడ్డిని కలిసి కుటుంబ పరిస్థితిని వివరించి.. తమకు సహయం చేయాలంటూ జగ్గారెడ్డికి అభ్యర్థించారు. ఈ నేపథ్యంలో శనివారం సంగారెడ్డిలోని తన నివాసానికి వికాస్ కుటుంబాన్ని జగ్గారెడ్డి పిలుపించుకున్నారు. ఈ సందర్భంగా రూ. 7.50 లక్షల చెక్కను వికాస్ కుటుంబానికి ఆయన అందజేశారు. ఈ సందర్భంగా అంధుడైన వికాస్ గానం చేసిన పాటలకు జగ్గారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. వికాస్‌కు స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేసి అందజేశారు. తాను ఇచ్చిన నగదుతో అప్పు తీర్చడమే కాకుండా.. యూట్యూబ్ చానల నిర్వహించుకునేందుకు మిగిలిన మొత్తాన్ని వినియోగించాలంటూ వికాశ్ కుటుంబ సభ్యులకు పీసీసీ వర్కింగ్ ఆ డబ్బుతో అప్పును పూర్తి తీర్చడమే కాకుండా యూట్యూబ్ ఛానల్ నిర్వహణకు మిగిలిన మొత్తాన్ని వెచ్చించాలని వికాస్‌కు సూచించారు. ఈ సందర్భంగా వికాస్ మాట్లాడుతూ.. బాగా చదువుకుని కలెక్టర్ అవడమే తన లక్ష్యమని ఈ సందర్భంగా జగ్గారెడ్డికి వివరించారు. అనంతరం స్వయంగా ఆయనే కారును ఏర్పాటు చేసి వికాస్ నాయక్ కుటుంబాన్ని వారి స్వస్థలానికి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పంపించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





