ములుగు, ప్రజాతంత్ర, డిసెంబర్ 6: స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క సొంత గ్రామం ములుగు మండలం జగ్గన్నపేటలో సర్పంచ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్టీలకతీతంగా గ్రామాభివృద్ధి కోసం జగ్గన్నపేట గ్రామ పంచాయతీ పరిధిలోని ఏడు పల్లెలు మంత్రి సీతక్క చొరవతో కాంగ్రెస్ పార్టీ బలపరచిన అభ్యర్థి ఆర్రెం వెంకన్నను సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నాయి. అలాగే మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్ అనుచరులకు చెందిన అభ్యర్థిని ఉప సర్పంచ్ పదవికి గ్రామస్థులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తమ స్వగ్రామంలో గ్రామ సర్పంచ్ ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు మంత్రి సీతక్క సంతోషాన్ని వ్యక్తం చేశారు గ్రామాభివృద్ధి కోసం నిత్యం కృషి చేస్తూనే ఉంటానని హామీ ఇచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





