ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌కర్‌ రాజీనామా

  • రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు జగదీప్‌ ధన్‌ఖడ్‌ రాజీనామా 
  •  వైద్య పరమైన కారణాలతోనేని వెల్లడి

హైదరాబాద్​, ప్రజాతంత్ర, జూలై 21 : పార్లమెంటు వర్షాకాల సమావేశాల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ ( Jagdeep Dhankhar ) తన పదవికి రాజీనామా చేశారు. వైద్య పరమైన కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు పంపిన లేఖలో ఆయన పేర్కొన్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన రోజే ధన్‌ఖడ్‌ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. 2022 ఆగస్టులో ధన్‌ఖడ్‌ ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ‘‘ఆరోగ్య సంరక్షణతో పాటు వైద్యుల సలహాలను పాటించేందుకు వీలుగా ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేస్తున్నాను. ఇది తక్షణమే అమల్లోకి వస్తుంది. నా పదవీ కాలంలో మద్దతుగా నిలిచిన రాష్ట్రపతి, ప్రధాని, పార్లమెంటు సభ్యులందరికీ కృతజ్ఞతలు. వారి నుంచి లభించిన అమూల్యమైన సహకారం, ఆప్యాయతలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. పదవీకాలంలో ఎన్నో విలువైన విషయాలు నేర్చుకున్నాను. అనేక అనుభవాలను మూటగట్టుకున్నాను. ఈ పరివర్తనాత్మక సమయంలో ఉపరాష్ట్రపతిగా.. దేశ ఆర్థిక పురోగతిని, అభివృద్ధిని గమనించే అవకాశం రావడాన్ని నేను గౌరవంగా భావిస్తున్నాను. ఇది నాకు సంతృప్తినిచ్చింది. ప్రపంచ వేదికపై భారత్ విజయాల పట్ల గర్విస్తున్నాను. దేశ ఉజ్వల భవిష్యత్తుపై అచంచలమైన విశ్వాసం ఉంది’’ అని ధన్‌ఖడ్‌ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *