కొండంత అండ కొండబత్తిని జగదీశ్వరరావు

15. జనధర్మో విజయతే

జనధర్మ1958 లో ప్రారంభించిన రోజుల్లో దివ్వెల హనుమంతరావు చాలా
సహాయం చేసేవారు. ఆచార్య జనధర్మ పత్రికను జగదీశ్వర ప్రెస్ లో కీర్తి శేషులు
వీరభద్రరావగారు నిర్వహించేవారు. జనధర్మ సాహితీ సంచికలను కూడా జగదీశ్వర
ప్రెస్ లో ప్రింట్ చేయించేవారు. ఇద్దరూ సమయం దొరకదు. కాని మద్యలో
ఇద్దరూ చదరంగం ఓ సారి ఆడుకుందామా అనేవారు. ఇద్దరికీ ఇష్టం. ఓ సారి నేను
పక్కనున్న బడికి నాన్నకు కలుసుకుందామనుకుంటే, ఈ ఆట ఆగదు. పోనీకుండా ఉండుండు
అని ఆపేవాడు. ఆ ఇద్దరికీ వందలమంది మిత్రులు ఉంటారు.


ప్రజామిత్ర దివ్వెల హనుమంతరావు
మిత్రుడు ‘‘ప్రజామిత్ర’’ పేరుతో దివ్వెల హనుమంతరావు వార పత్రికను
నడిపించేవారు. ఎన్ని పత్రికలైనా బాలాజీ ప్రెస్ లో ప్రింట్ చేయడంలో
తప్పలేదు. కాని రెండు జాతీయ వార పత్రికలను నడపడం బాగుండదు అనుకునేవాడు
ఆచార్య గారు. అయినా న్యూస్ ప్రింట్ పేపర్ కోసం, విడిగా మరో ప్రెస్
ప్రజామిత్ర ప్రింట్ చేయడానికి సహాయాలు చేసేవారు.

మాచర్ల జగన్నాధం పరిశ్రమ
గీత కార్మికుల జీవితం కోసం ఒక పత్రిక ఉండాలనీ. ‘‘పరిశ్రమ’’ పేరుతో మాచర్ల
జగన్నాథంను కొన్ని సంవత్సరాలు బాలాజీ ప్రింటింగ్ ప్రేస్ లోనే ఆచార్యగారే
నడిపించే వారు. (దాదాపు వందసార్లు నేను పరిశ్రమ పత్రికల పేజీలను ఎడిట్ చేసి
ప్రింటి చేసేవాడిని) డబ్బుల లెక్కలు ఉన్నాయో లేవో. పత్రిక వస్తే చాలు అని
వారి నమ్మకం.

ప్రతినిధి పక్షపత్రిక సంపాదకుడు మల్లేశం
‘‘ప్రతినిధి’’ పేరుతో పక్షపత్రికను నిర్వహించారు. నాయీ బ్రాహ్మణుల
కష్టాలకోసం ఈ పత్రికలు ఎందుకు చేయకూడదు అని ఆయన ప్రశ్న.
ఆ అన్నిటి రకాల పత్రికలలో కాకతీయ ను ప్రారంభించిన వారు పాములపర్తి
సదాశివరావుగారు. మేధావి. స్వంత ఆలోచనలు కలిగిన వారు. మొత్తం దేశానికి దిశ ఏది

మంచిదో చెప్పగలిగిన వారు. ఆ ఆంధ్రపత్రికనుంచి సొంత పత్రిక దశకు నడవడం చిన్న
విషయం కాదు. మిత్రులలో గొప్పవారు పాముల పర్తి సదాశివరావు, జగదీశ్వరరావు,
జగదీశ్వర ప్రెస్ యజమాని శ్రీ వీరభద్రరావుగారు విశేషమైన పెద్దలు.

పాముల పర్తి సదాశివరావు-జగదీశ్వరరావు
జనము మరియు ధర్మము అంటే జనధర్మ అని ప్రసిద్ధ పాత్రికేయుడు
శ్రీ పాములపర్తి సదాశివరావు గారు జనధర్మ ప్రారంభ సంచికకు
పత్రికాధర్మాన్ని జన ధర్మంగా జన ధర్మాన్ని పత్రికా ధర్మంగా
సూచిస్తూ ఈ ముప్పది ఏండ్ల ప్రౌఢ జనధర్మ కు కలిసిన వరంగల్‌కు వాణి
జంటకు నేడు పండుగ జరుపుకుంటున్న పత్రికా సుందరి ముప్పదేళ్ళ క్రిందట
పుట్టినప్పుడు ఆయన ఆశీర్వదించాడని కొండబత్తిని జగదీశ్వరరావుగారు
ప్రస్తావించారు.

యం యస్ ఆచార్య జీవనం చుట్టూ ఉద్యమాలే, ఆయన రోజూ
ప్రచురించిన పత్రికే ఒక ఉద్యమం. రకరకాల సమస్యలు. కేసులు, బెదిరింపులు,
సంప్రదింపులు. ఒక్కోసారి ప్రెస్ కార్మికులను రెచ్చగొట్టే సంఘాలు.
ఇబ్బంది పెట్టడం. సమ్మెలు, లాకౌట్ లు బోలెడున్నాయి. జనధర్మ
చుట్టూ నడుస్తునే వచ్చాయి. జనధర్మ శ్రేయోభిలాషి, ప్రియ మిత్రులు,
ఉపాధ్యాయ సంఘం నాయకులు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం
కలలుగన్న పెద్దదిక్కు.


మొత్తం జనధర్మ రూపురేఖ ప్రకాశాలపై జగదీశ్వరరావుగారి
విశ్లేషించేవారు. బాలాజీ ప్రింటింగ్ ప్రెస్ లో జగదీశ్వరరావు, పక్కన
మిమిక్రీ వేణుమాధవ్ కలిసి ఉంటే ఆచార్యగారికి గంటలన్నీ కాలక్షేపం
అయిపోయేది. శ్రీ పడిశాల వీరభద్రయ్య, జగదీశ్వరరావు, మిమిక్రీ వేణుమాధవ్

కలిసి ఉండేవారు. వారితో మాట్లాడడమే మాకు నిజమైన ఎడ్యుకేషన్. ముఖ్యమైన
మరో అంశం ఏమంటే, జగదీశ్వరరావు నచ్చిన నినాదం: ‘అనవరత జాగరణయే
ప్ర్రజాస్వామ్యానికి శ్రీరామరక్ష’.
వారి మిత్రులు, ఎన్నో విద్యాసంస్థలలను దోహదం చేసిన మంచివారు
కీర్తిశేషులు పడిశాల వీరభద్రయ్య. ఏ సాహిత్య కార్యక్రమాలలో
వీరంతాపాల్గొనే వారు. ఈ నినాదమే ‘‘సంపాదకులు ‘అనవరత జాగరణయే
ప్ర్రజాస్వామ్యానికి శ్రీరామరక్ష’ అన్న ప్రజాస్వామ్యానికి
ఆయువుపట్టిన ఆదేశసూత్రాన్ని పత్రికను నిరంతరం వీపుతట్టి
హెచ్చరిస్తూ ఉండేలా సంపాదకీయ కాలంపై నుకుటంగా మలుచుకున్నారు.
నాటినుండి నేటివరకు వరంగల్‌ నగరజీవితంలో నేమి, జనజీవనంలో నేమి-ఎన్నో
మార్పులు వచ్చినవి. రాజకీయ రచ్చబండల స్వభావ స్వరూపాలు పూర్తిగా
మారిపోయినవి. గోదావరిజలాలు వరంగల్‌ నగరానికి వచ్చినవి. అయినా వరంగల్‌
ప్రజలదాహం అవి ఇంకా తృప్తిదీరా తీర్చలేక పోయినవి వరంగల్‌ నగరానికి
మంచినీటి సమస్యను ఉద్యమ ప్రాయంగా జనధర్మ – తరువాత వరంగల్‌ వాణి ఒక
రాజకీయ సంస్థవలె పోరాటం నిర్వహించినవి’’ అని జగదీశ్వరరావు రాసారు.

మంచి నీళ్లకోసం పోరాడిన పత్రికలు
నగరసమస్యలలో సహజంగానే మంచినీటిసమస్య ప్రాధాన్యతను సంత
రించుకుంది. ఏనాటిదోకాని ధర్మసాగరం చెరువు నిజాం పరిపాలనలో ‘బల్దియా’
పుణ్యమా అంటూ ఇంతకాలం వరంగల్‌కు ప్రాణాధారమై ఆదుకుంది. ఆ చెరువుకు
ఇటు అటూ ఉన్న రైతాంగం తమ నీటిని ఎక్కడో ఉన్న వరంగల్‌ వాసులకు
పంపడమేమిటని తమ భూములు నీళ్లు లేక బీళ్లు అయిపోవడమేమిటని పోరాటాలు
నిర్వహించారు. అసలీ మంచినీటి సనుస్య, నగర పాలకాధ్యక్షులకు
ఎప్పటికప్పుడు కొరకారాని సమస్యగా తయారయింది, శ్రీ హయగివచారిగారు
అధ్యక్షులుగా ఉన్నప్పటినుండి ఆరెల్లి బుచ్చయ్య ఆ తదుపరి ఇటీవలి
వరకు అధ్యక్షులుగా వచ్చిన అబ్దుల్‌ ఖాదర్‌గారి వరకు అందరినీ
వేధించిందనే చెప్పాలి.

సమస్యను నిష్పక్షపాతంగా ఆకళింపు చేసికొన్న
నగర పౌరులు ఈ సమస్య కనీసం ఈ స్థాయి వరకైనా పరిష్కారమైందంటే
మొదటి క్రెడిట్‌ జనధర్మకు రెండవ క్రెడిట్‌ శ్రీ ఆరెళ్లి బుచ్చయ్య
గారలకు మాత్రమే ఇవ్వవలసి ఉంటుంది. ముఖ్యమంత్రుల స్థాయిలో
శ్రీయుతులు చెన్నారెడ్డి, కీ.శే.అంజయ్య కేంద్ర మంత్రిగా శ్రీ పి.వి.
నరసింహారావు గారలు చేయగలిగిందంతా చేశారు. ఇవి విస్మరించ వీలులేని
విషయాలు, జనధర్మ వారపత్రికగా ప్రారంభమై ద్వైవారపత్త్రికగా మారి
దినపత్రికగా రూపాంతరం చెందింది. కొన్నాళ్ళోక ప్రత్యేక ద్వైమాసిక
సాహిత్యాను బంధము. మధ్య మధ్య అప్పుడప్పుడు సాహితీ సంకలనాలు
వెలువడినవి. రచయితుల మహాసభలు వరంగల్‌లో జరిగిన తర్వాత-జిల్లా రచయితల
మహాసభల నిర్వహణ – ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంలో చిత్రకారుల సభలు
నాటక ప్రదర్శనలు వరంగల్‌కొక ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్‌ కావాలనే ప్రజల
ప్రగాఢమైన ఆకాంక్షలకు అక్షర రూపమిచ్చింది ఈ పత్రికయే. పోతన పంచశతి
జయంతి ఉత్సవాల సందర్భాలను సైతం సాహితీ పరంగా సాంస్కృతికంగా
ఉద్యమప్రాయంగానే ఈ పత్రిక స్వీకరించడం. ఆనందించతగిన అంశం. అని కూడా
జగదీశ్వరరావు వివరించారు.

Last Week: 14. జనధర్మో విజయతే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *