ఐటీడీఏ భవనాల నిర్మాణాలకు నిధుల మంజూరు

– ధన్యవాదాలు తెలిపిన మంత్రి సీతక్క

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 24: ఐటీడీఏ ఏటూరునాగారం ఐటీడీఏ ఉట్నూరు నూతన భవనాల నిర్మాణం కోసం రూ.15 కోట్ల చొప్పున నిధులు మంజూరు చేస్తూ జీవో జారీ కావటం పట్ల పంచాయతీరాజ్‌ ,గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క హర్షం వ్యక్తం చేశారు. అదిలాబాద్‌ జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా ఉన్నప్పుడు ఐటీడీఏ ఉట్నూరు భవనం, తన సొంత నియోజకవర్గంలోని ఏటూరునాగారం ఐటీడీఏ భవనం శిథిలావస్థలో ఉన్నాయని గుర్తించి అప్పటి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్కల దృష్టికి మంత్రి సీతక్క తీసుకెళ్లారు. ఆ భవనాల స్థానంలో అధునాతన సదుపాయాలతో భవనాలు నిర్మించాలని, అందుకు నిధులు మంజూరు చేయాలని సీఎం, డిప్యూటీ సీఎంలకు విజ్ఞప్తి చేశారు. తాజాగా ఆ రెండు భవనాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు, నిధుల మంజూరుకు సహకరించిన గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌కు సీతక్క ధన్యవాదాలు తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *