– జోగు రామన్న కోరిక మేరకు కేసీఆర్ మంజూరు
– కొనసాగుతున్న మొదటి దశ పనులు :కేటీఆర్
అదిలాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24: తమ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ దూర దృష్టితో రాష్ట్రంలో పది ప్రాంతాల్లో ఐటీ టవర్‌ను నిర్మించాలని ఓ మంచి ఆలోచన చేశారని బీఆరఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు. ఆదివాసుల జిల్లా ఆదిలాబాద్ వంటి వెనుకబడిన జిల్లాలోనూ ఐటి ఫలాలు అందాలన్న ఆలోచనతో జోగు రామన్న కోరిక మేరకు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఐటి టవర్‌ను మంజూరు చేశామన్నారు. ప్రస్తుతం మొదటి దశ పనులు కొనసాగుతున్నాయని, 700 మంది యువతీయువకులకు ఉపాధి కల్పించే విధంగా ఇక్కడ ఐటి టవర్ ను నిర్మించేందుకు చర్యలు చేపట్టామని చెప్పారు. రెండో దశలోనూ పూర్తి నిర్మాణం జరిగితే 6000 నుంచి 7000 మందికి ఉద్యోగాలు లభిస్తాయన్నారు. ఈ ఐటీ టవర్ పనులను ఆయన మంగళవారం పరిశీలించారు. నిజామాబాద్‌లో నిర్మించిన ఐటీ టవర్‌లో ఇంకా ఉద్యోగాలు భర్తీ జరగలేదని, నిజామాబాద్‌తో పాటు ఆదిలాబాద్ జిల్లాలో నిర్మించిన ఐటీ టవర్‌లో ఉద్యోగుల నియామకాలు వెంటనే జరిగేలా చర్యలు చేపట్టాలని కోరారు. కాగా, ఇక్కడి సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫ్యాక్టరీని తెరిపించాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదేనని అయితే ఫ్యాక్టరీని తెరిపించడంలో రెండు ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. అదిలాబాద్ జిల్లాలో పర్యటించిన సమయంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సిమెంట్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని హామీ ఇచ్చారని, ఫ్యాక్టరీని తెరిపించే బాధ్యత బీజేపీకి చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలదేనని కేటీఆర్ స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





