– సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 6 : జర్నలిస్టుల అక్రిడిటేషన్ దరఖాస్తుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని సమాచార పౌరసంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ సిహెచ్.ప్రియాంక ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుల ప్రక్రియపై ఇటీవల మీడియాలో వస్తున్న వార్తలపై జర్నలిస్టులు ఆందోళన చెందవద్దన్నారు. రాష్ట్రస్థాయిలో ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులను ఈ నెల 10న జరిగే రాష్ట్రస్థాయి అక్రిడిటేషన్ కమిటీ సమావేశంలో స్క్రూటినీ చేసి అర్హులైన జర్నలిస్టులకు కొత్త అక్రిడిటేషన్ కార్డులను మంజూరు చేస్తామని, అర్హులైన జర్నలిస్టు ఆన్లైన్‌లో తమ దరఖాస్తులను అప్‌లోడ్ చేసుకోవాలని, ఏప్రిల్‌లో అక్రిడిటేషన్ జారీ ప్రక్రియ పూర్తి చేయడం జరుగుతుందని, కమిషనర్ తెలిపారు. అదేవిధంటా జిల్లాస్థాయిలో కూడా ఈనెలలోనే జిల్లా కమిటీలు సమావేశాలు ఏర్పాటు చేసి అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్‌లు జారీ చేస్తామని, కావున జిల్లాస్థాయిలో దరఖాస్తు చేసుకొనే అర్హులైన జర్నలిస్టులు వెంటనే తమ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో చేసుకోవాలని ఆమె కోరారు.
———————————————————————————————————————————————————–

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.