ఇజ్రాయెల్ యుద్ధ విమానం కూల్చివేత

– ప్రకటించుకున్న ఇరాన్

టెహ్రాన్, మార్చి 21: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు అడ్డుకట్ట పడటం లేదు. తమ భూభాగంపై దాడికి దిగిన ఇజ్రాయెల్ యుద్ధ విమానాన్ని కూల్చేసినట్టు ఇరాన్ మిలిటరీ శనివారంనాడు ప్రకటించింది. దీనికి ఒకరోజు ముందే ఆమెరికా ఎఫ్-35 స్టెల్త్ యుద్ధ విమానాన్ని ఢీకొట్టామని ఇరాన్ ప్రకటించుకుంది.ఇజ్రాయెల్ యుద్ధవిమానంపై దాడి జరిగినట్టు ఇజ్రాయెల్ కూడా గుర్తించిందని ‘టెహ్రాన్ టైమ్స్’ తెలిపింది. తమ యుద్ధవిమానాన్ని టార్గెట్ చేస్తూ ఉపరితలం నుంచి గగనతలంపైకి క్షిపణిని ప్రయోగించారని ఇజ్రాయల్ మిలిటరీ పేర్కొంది. ఏ తరహా యుద్ధ విమానం అనేది మాత్రం వెల్ల డించలేదు. కాగా, ఇరాన్ గగనతలంపై ఇజ్రాయెల్ విమానంపై క్షిపణి ప్రయోగం జరిగిందని, అయితే విమాన సిబ్బంది ప్రామాణిక విధానాలను అనుసరించడం ద్వారా ముప్పును తప్పించారని, ఎలాంటి నష్టం లేకుండా మిషన్ను పూర్తి చేశారని ‘ది టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్’ పేర్కొంది. ఇరాన్ క్షిపణి అతి సపానికి రావడంతో పైలట్ వృత్తిపరమైన నైపుణ్యంతో అత్యంత వేగంగా స్పందించి దాడిని తప్పించినట్టు ఆ కథనం పేర్కొంది. విమానానికి నష్టం జరిగినట్టు ఎలాంటి సమాచారం లేదు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *