గాజాపై కొనసాగిన ఇజ్రాయిల్‌ దాడులు

– తాజాగా 30మంది పాలస్తీనియన్ల దుర్మరణం

గాజా, అక్టోబర్‌ 1: గాజాపై ఇజ్రాయిల్‌ చేస్తున్న అమానవీయ దాడులకు ఇప్పటికే వేలాది మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. తాజాగా ఇజ్రాయిల్‌ చేసిన దాడుల్లో 30 మందికిపైగా పాలస్తీనియన్లు మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే బుధవారం ఉదయం గాజా నగరానికి తూర్పున ఉన్న జీ టౌన్‌లో అల్‌ ఫలు స్కూల్‌పై క్షిపణి దాడికి పాల్పడిరది. ఈ స్కూల్లోనే వందలాది మంది నిరాశ్రయులు ఆశ్రయం పొందుతున్నారు. ఈ క్షిపణి దాడిలో 34 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. అలాగే గాజా నగరానికి తూర్పున ఉన్న దరాజ్‌ పరిసరాల్లోని ఒక ఇంటిపై ఇజ్రాయిల్‌ సైన్యం బాంబు దాడికి పాల్పడంతో ఏడుగురు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయని డియా వర్గాలు పేర్కొన్నాయి. కాగా, అక్టోబర్‌ 7 2023న ప్రారంభమైన ఇజ్రాయిల్‌ దాడుల వల్ల ఇప్పటివరకూ ఎన్నో భవనాలు, పాఠశాలలు బాంబుల దాడికి కూలిపోయాయి.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *